2024 Lok Sabha polls: అందుకే అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టారు: మమతా బెనర్జీ
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద సైనికుల పదవీ విరమణ వయసును 65 ఏళ్ళకు పెంచాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

Mamata Banerjee's 'dream for India
2024 Lok Sabha polls: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద సైనికుల పదవీ విరమణ వయసును 65 ఏళ్ళకు పెంచాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ పథకం కింద కేవలం నాలుగేళ్ళు మాత్రమే త్రివిధ దళాల్లో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, నాలుగేళ్ళ తర్వాత తమ భవిష్యత్తు ఏమైపోతుందన్న ఆందోళనలో సైనికులు ఉంటారని మమతా బెనర్జీ చెప్పారు.
Maharashtra Crisis: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్, సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు
దీనిపై అనిశ్చితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు ఏళ్ళ తర్వాత ఆ సైనికులు ఏ పని చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు. దేశంలో 2024లో నిర్వహించే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశ పెట్టిందని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, శివసేన నేత సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపిన విషయంపై కూడా ఆమె స్పందించారు. ప్రజలను ఈ విధంగా బీజేపీ ఎందుకు వేధిస్తోందని ఆమె నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని నడిపే తీరు ఇదేనా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.