నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి గట్స్‌కు హ్యాట్సాఫ్!
బాలయ్య, బోయపాటి చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి..

బాలయ్య, బోయపాటి చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి..
గత వారం రోజులుగా ఓ ప్రొడ్యూసర్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయనెవరో కాదు యువ నిర్మాత, ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి.. నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ చిత్రం(BB3) రూపొందుతున్న సంగతి తెలసిందే. మార్చి మొదటివారంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని రవీందర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన చిత్రాలు నిర్మాతగా పెద్దగా గుర్తింపు, డబ్బు తీసుకురాకపోయినా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారంటే ఆయన గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
బాలయ్య, బోయపాటి కాంబో ఒక ఎత్తయితే అభిరుచి గల నిర్మాతగా ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే తపన మిర్యాల రవీందర్ రెడ్డిది. బాలయ్య అభిమానులకు, ప్రేక్షకులను నచ్చే, వారంతా మెచ్చే సినిమా ఇస్తానని సినిమా ప్రారంభం రోజే నిర్మాత మాటిచ్చారంటే సినిమా అంటే తనకు ఎంత ప్యాషనో అర్థమవుతుంది. ఇక బాలయ్య బర్త్‌డే సందర్భంగా ‘BB3 First Roar’ పేరుతో టీజర్ రిలీజ్ చేయగా సోషల్ మీడియా షేక్ అయింది.
బాలయ్య వెర్షన్‌లో చెప్పాలంటే చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగరాయాలన్న మేమే అన్నట్లు లాక్‌డౌన్ సమయంలోనూ సోషల్ మీడియా వేదికగా సత్తా చాటాడు బాలయ్య. టీజర్ రిలీజ్ చేసిన రెండు రోజులకే దాదాపు 10 మిలియన్ల వ్యూస్ రాబట్టడం విశేషం. బాలయ్య కెరీర్లో ఇదే అత్యధికం.
అలాగే బాలయ్య 60వ పుట్టినరోజు వేడుకలను అభిమానుల సమక్షంలో సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేయగా బోయపాటితో కలిసి పాల్గొన్నారు రవీందర్ రెడ్డి. రూ.వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలే పోస్టర్లు, వీడియోలు విడుదల చేశాక వివాదాలు ఎదుర్కొంటుంటే కేవలం ఒకే ఒక్క షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న చిత్రం, సింగిల్ డైలాగ్ టీజర్‌తో ఈ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడం అంటే మాటలు కాదు. BB3 బ్లాక్ బస్టర్ కొట్టాలని, మిర్యాల రవీందర్ రెడ్డి మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని బాలయ్య అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.