బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే.. అతడే అంటున్న హిమజ

బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే.. అతడే అంటున్న హిమజ

Updated On : December 20, 2020 / 1:26 PM IST

Biggboss 3 Fame Himaja : బిగ్ బాస్ 4 సీజన్ ఫినాలేకు చేరుకుంది. ఈ సీజన్ విజేత ఎవరు అనేది ఒక కంటెస్టుంట్లు, వారి అభిమానులు మాత్రమే కాదు.. మునపటి సీజన్లలో పాల్గొన్న వారు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. బిగ్ బాస్ 3 ఫేం హిమజ కూడా బిగ్ బాస్ ఫాలో అవుతున్నానని చెప్పారు. ఈ సీజన్ 4లో ఎవరు విన్నర్ అవుతున్నారని అడిగితే.. మిస్టర్ కూల్ అభిజిత్ విన్నర్ అవుతాడమే అని చెప్పారు.

ప్రస్తుతం బిగ్ బాస్ లో ఓటింగ్ చూస్తుంటే.. అభిజిత్ విన్ అయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. కానీ, ఒక మహిళగా మాత్రం తాను అరియానా లేదా హారిక ఇద్దరిలో ఎవరో ఒకరు గెలవాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

మాజిగూడలోని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూంలో ప్రముఖ నటి హిమజ సందడి చేసింది. షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్‌ జువెల్లరీ షోను ఆమె ప్రారంభించింది. ఈ సందర్భంగా అక్కడి షోరూంలో ఆభరణాలను పరిశీలించింది. బరువు తక్కువగా ఎక్కువ డిజైన్‌లు ఉన్న బంగారమంటే తనకెంతో ఇష్టమని తెలిపింది.