Jeetu Chaudhary: బీజేపీ నేత దారుణ హత్య.. ఇంటి ముందే కాల్పులు!

దేశ రాజధానిలో శోభయాత్రపై రాళ్ల రువ్వడంతో మొదలైన ఘర్షణ వాతావరణం.. నిందితుల ఆక్రమణలను తొలగింపుతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది.

Jeetu Chaudhary: బీజేపీ నేత దారుణ హత్య.. ఇంటి ముందే కాల్పులు!

Jeetu Chaudhary

Updated On : April 21, 2022 / 2:25 PM IST

Jeetu Chaudhary: దేశ రాజధానిలో శోభయాత్రపై రాళ్ల రువ్వడంతో మొదలైన ఘర్షణ వాతావరణం.. నిందితుల ఆక్రమణలను తొలగింపుతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా, బీజేపీ నేతను దుండగులు కాల్చివేయడంతో మరోసారి ఢిల్లీలో వాతావరణం ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని మయూర్ విహార్‌కు చెందిన బీజేపీ యువ నాయకుడు జీతు చౌదరిని దుండగులు కాల్చి చంపారు.

Delhi Covid : పెరుగుతున్న కోవిడ్ కేసులు- నేడు ఢిల్లీ ప్రభుత్వం కీలక సమావేశం

ఆయన ఇంటి బయట బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. గాజీపుర్​ ప్రాంతంలోని అతని నివాసం వద్దే గుర్తుతెలియని వ్యక్తులు బైక్​పై వచ్చి కాల్చి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దేశ రాజధానిలో.. అది కూడా ఆరు రౌండ్ల కాల్పులు జరపడం ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. హత్య కాబడిన జీతూ చౌదరి మయూర్​ విహార్​ జిల్లా బీజేపీకు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Delhi : జహంగీర్‌‌పూర్‌‌లో మరోసారి టెన్షన్.. పోలీసులపైకి రాళ్లు

హత్య జరిగిన ఘటనాస్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, హత్య జరిగిన కొద్దిసేపటికే బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్ ట్విట్టర్‌లో జీతూ చౌదరి మృతికి సంతాపం తెలిపారు. బీజేపీ నాయకుడిని ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్చి చంపారని తెలియజేయగా.. హంతకులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరారు.