Etala Rajender comments Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఈటల సంచలన వ్యాఖ్యలు..దమ్ముంటే పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు. దమ్ముంటే పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు.

Etala Rajender comments Congress
Etala Rajender comments Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు. దమ్ముంటే పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు. రాజీనామా చేసి విశ్వాసం పొందలని చెప్పారు. ‘మీ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని కోరండి’ అని సూచించారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే 5 నిమిషాల్లో ఆమోదించారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కొందరు టీఆర్ఎస్ మంత్రులుగా ఉన్నారు..వారు దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరాలని పేర్కొన్నారు. బై ఎలక్షన్ రావాలంటే దమ్ము ఉండాలని చెప్పారు. దమ్మున్న లీడర్ రాజగోపాల్ రెడ్డి, అందుకే రాజీనామా చేశారని పేర్కొన్నారు.
ఉప ఎన్నికల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతామని తెలిపారు. రాజీనామా చేస్తున్న అందరి దారి బీజేపీ వైపేనని స్పష్టం చేశారు. ‘కేసీఆర్ నీకే కాదు..మాకు ఉపాయం ఉంది’ అని తెలిపారు. మునుగోడులో తమ స్ట్రాటజీ ఏంటో చూపిస్తామన్నారు.