Eetela Rajender Target KCR : నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు-ఈటల రాజేందర్ సంచలనం

హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అన్న ఈటల.. కేసీఆర్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను పోషించే బాధ్యతను హైకమాండ్ తనకు అప్పచెప్పిందని తెలిపారు.

Eetela Rajender Target KCR : నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు-ఈటల రాజేందర్ సంచలనం

Eetela Rajender Target Kcr

Updated On : July 30, 2022 / 6:35 PM IST

Eetela Rajender Target KCR : హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అన్న ఈటల.. కేసీఆర్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను పోషించే బాధ్యతను హైకమాండ్ తనకు అప్పచెప్పిందని తెలిపారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన నేతలు తనతో టచ్ లో ఉన్నారని… త్వరలోనే ఊహకు అందనంత స్థాయిలో చేరికలు ఉంటాయని ఈటల బాంబు పేల్చారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతో కాలంగా తనకు మంచి మిత్రుడని… ఆయన బీజేపీలో చేరడం పక్కా అని అన్నారు. హుజూరాబాద్ ప్రజల కాలికి ముళ్లు గుచ్చుకుంటే నోటితో పీకే వ్యక్తి ఈటల అని చెప్పారు.

Komatireddy Rajagopal Reddy : ‘ఇది కేసీఆర్ పై నా యుద్ధం..ఎవ్వరి మాటా వినేదేలే..రాజీనామా విషయంలో తగ్గేదేలే’..

రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని ఈటల విమర్శించారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు పెడుతున్న ఆహారంలో వానపాములు, బొద్దింకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు సరిగా డబ్బులు చెల్లించకపోవడం వల్లే వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని చెప్పారు. మంత్రులు స్వతంత్రంగా తిరిగి పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదన్నారు. నేటి వరకు కూడా స్కూళ్లలో పుస్త‌కాలు ఇవ్వలేద‌ని, ఇలాంటి దుస్థితికి కార‌ణం కేసీఆర్ ప్ర‌భుత్వ‌మ‌ని ఈటల విమర్శించారు.

Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఆపే బాధ్యత నాది : ఉత్తమ్

”మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం పక్కా. హుజూరాబాద్ లో తన గెలుపును రాజగోపాల్ రెడ్డి కోరుకున్నారు. త్వరలో టీఆర్ఎస్ నుంచి ఊహకందని విధంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయి. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు” అని ఈటల రాజేందర్ అన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw