Top Headlines : రైతుబంధు కావాలా..? రాబందులు కావాలా..? ప్రజలే తేల్చుకోవాలి : సీఎం కేసీఆర్‌

రైతుబంధు కావాలా..? రాబందులు కావాలా..?ప్రజలే తేల్చుకోవాలి అంటూ సీఎం కేసీఆర్‌ సూచించారు.

Top Headlines : రైతుబంధు కావాలా..? రాబందులు కావాలా..? ప్రజలే తేల్చుకోవాలి : సీఎం కేసీఆర్‌

3 PM Headline

తేల్చుకోండి..
రైతుబంధు కావాలా..? రాబందులు కావాలా..?ప్రజలే తేల్చుకోవాలి అంటూ సీఎం కేసీఆర్‌ సూచించారు.

సీఐడీ వాదనలు..
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసుపై హైకోర్టులో విచారణ జరిగాయి. చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సీఐడీ వాదనలు వినిపించింది.

రిపోర్ట్‌ రగడ..
బాబు మరికొంతకాలం బెయిల్‌పై బయట ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు. డాక్టర్లను మేనేజ్‌ చేసి హెల్త్‌ రిపోర్టును రాయించుకున్నారు అంటూ సజ్జల ఆరోపించారు.

క్రెడిట్‌ మాకే..
హైదరాబాద్‌ అభివృద్ధి ఘనత కాంగ్రెస్‌దేనని, ఇచ్చిన హామీలను BRS విస్మరించింది అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించారు.

నమ్మొద్దు..
పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఓటర్లకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. విపక్షాల మాయ మాటలు నమ్మొదని మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు సూచించారు..

మార్పు కోసం..
కాంగ్రెస్‌తోనే తెలంగాణలో మార్పు సాధ్యం అని పీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. మేడ్చల్‌లో BRS నేతలు భూములు కబ్జా చేశారు అంటూ రేవంత్ ఆరోపించారు.

ఢీ అంటే ఢీ..
పేదల భూములు లాక్కోవడం తప్ప చేసిందేమీ లేదు అంటూ బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.BRSను ఓడించాలన్న కసితో ప్రజలున్నారని అన్నారు.
ఆన్సర్‌ ప్లీజ్‌..
కర్ణాటకలో అమలు చేయని హామీలు తెలంగాణలో నెరవేరుస్తారా..? అంటూ కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు సీరియస్‌ అయ్యారు.

సమరశంఖం..
హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంపై BRS ఫోకస్ పెట్టింది. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ఈనెల 25న భారీసభ నిర్వహించనుంది.
సీబీఐ విచారణ..

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే భూసేకరణ స్కామ్‌పై సీరియస్..ఢిల్లీ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది.

కమలం వరాలు..
రాజస్థాన్‌లో సంకల్ప పత్ర పేరుతో BJP మ్యానిఫెస్టో ప్రకటించింది.రైతులు, మహిళలు, విద్యార్థులకు కమలం వరాలు కురిపించింది.

అంతా సేఫ్‌..
ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో కార్మికులంతా సేఫ్‌గా ఉన్నారని సీఎం ప్రకటించారు.