Al-Qaeda suicide attack threat: అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర భద్రతా సంస్థలు

భార‌త్‌లోని ప‌లు రాష్ట్రాల్లో ఆత్మ‌హుతి దాడులు జ‌రుపుతామంటూ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ‌ బెదిరింపుల‌కు దిగ‌డంతో కేంద్ర భ‌ద్ర‌తా సంస్థ‌లు అప్ర‌మ‌త్త‌మయ్యాయి. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నాయ‌కురాలు నురూప్ శర్మ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో క‌ల‌క‌లం చెలరేగిన విష‌యం తెలిసిందే.

Al-Qaeda suicide attack threat: అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర భద్రతా సంస్థలు

Al Qaeda

Updated On : June 8, 2022 / 3:34 PM IST

Al-Qaeda suicide attack threat: భార‌త్‌లోని ప‌లు రాష్ట్రాల్లో ఆత్మ‌హుతి దాడులు జ‌రుపుతామంటూ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ‌ బెదిరింపుల‌కు దిగ‌డంతో కేంద్ర భ‌ద్ర‌తా సంస్థ‌లు అప్ర‌మ‌త్త‌మయ్యాయి. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నాయ‌కురాలు నురూప్ శర్మ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో క‌ల‌క‌లం చెలరేగిన విష‌యం తెలిసిందే. ఆమెను ఇప్ప‌టికే బీజేపీ స‌స్పెండ్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై ఓ లేఖ విడుద‌ల చేసిన అల్ ఖైదా ఢిల్లీ, ముంబై, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌లో దాడులు చేస్తామ‌ని పేర్కొంది.

Bihar: బిహార్‌లో నిర్భ‌య త‌ర‌హా ఘ‌ట‌న‌.. బ‌స్సులో బాలిక‌పై గ్యాంగ్ రేప్

దీనిపైనే భార‌త‌ భ‌ద్ర‌తా సంస్థ‌లు దృష్టి సారించాయి. ఢిల్లీ, ముంబై, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించాయి. ఆయా రాష్ట్రాల్లోని విమానాశ్ర‌యాలు, మెట్రోస్టేష‌న్లు, రైల్వే స్టేష‌న్లు, మార్కెట్ ప్రాంతాల్లో నిఘా పెట్టాల‌ని చెప్పాయి. అనుమానాస్ప‌ద వ్య‌క్తుల క‌ద‌లిక‌ల‌ను గుర్తిస్తే వెంట‌నే త‌గిన‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పాయి. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

Sri Lanka: చైనా నిర్మిస్తోన్న‌ కొలంబో పోర్ట్ సిటీలో 40 ఏళ్ల పాటు ప‌న్ను మిన‌హాయింపు

కాగా, మ‌హమ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నేత‌లు నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ చేసిన వ్యాఖ్య‌లను మ‌లేషియా, కువైత్, పాకిస్థాన్ వంటి ప‌లు దేశాలు ఖండించిన విష‌యం తెలిసిందే. అలాగే, ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ ఇస్లామిక్ కోఆప‌రేష‌న్ (ఓఐసీ) భార‌త్‌ను విమ‌ర్శిస్తూ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. అయితే, ఓఐసీ చేసిన ప్ర‌క‌ట‌న అసమంజ‌సంగా, సంకుచిత స్వ‌భావంతో కూడిన‌దిగా ఉందంటూ దాన్ని భార‌త్ ఖండించింది.