Chiranjeevi: ‘హనుమాన్ జయంతి’ రోజున చిరంజీవి స్పెషల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తాజా చిత్రం ‘ఆచార్య’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది....

Chiranjeevi Posts A Special Video On Occassion Of Hanuman Jayanthi
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తాజా చిత్రం ‘ఆచార్య’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా సందడి చేస్తుండటంతో ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆచార్య రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Chiranjeevi: నాన్-స్టాప్‌గా కష్టపడుతున్న మెగాస్టార్!
అయితే ఈ సినిమాలో సిద్ధ అనే కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరు, చరణ్ కలిసి నటించే సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా తాజాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి, తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ స్పెషల్ పోస్ట్ చేశాడు. ఇది ఆచార్య సినిమా షూటింగ్ సెట్స్‌లో చరణ్ మేకప్‌కు సంబంధించిన వీడియో అని తెలుస్తోంది.
Acharya: ‘ఆచార్య’లో చరణ్‌ను తగ్గించారా..?
కాగా ఈ వీడియోలో చరణ్ మేకప్ చేసుకుంటుండగా ఓ వానరం అక్కడకు చేరుకుంది. చరణ్ మేకప్ వేసుకోవడం అది ఆసక్తిగా చూస్తూ అక్కడే కూర్చుంది. ఇక ఆ వానరాన్ని గమనించిన చరణ్, దానికి బిస్కెట్లు ఇచ్చే ప్రయత్నం చేయగా, అది అతడి దగ్గరకు వెళ్లి కూర్చుంది. ఈ వీడియోకు శ్రీఆంజనేయం శ్లోకంను జోడించి చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. హనుమాన్ జయంతి రోజున ఈ వీడియోను చిరు పోస్ట్ చేయడంతో, దీన్ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram