Ramanuja statue : సతీసమేతంగా చిన్న జీయర్ ఆశ్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ చిన్నజీయర్ స్వామిని దర్శించుకున్నారు. కేసీఆర్ ను చిన్నజీయర్ స్వామి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ భగవత్ రామానుజాచార్య ప్రాజెక్టు విశేషాలనుతెలుసుకోనున్నారు.

Ramanuja statue : సతీసమేతంగా చిన్న జీయర్ ఆశ్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్

Cm Kcr Who Came To Sri Chinnajiyar Swamy Ashram

Updated On : October 11, 2021 / 1:22 PM IST

CM KCR who came to Sri Chinnajiyar Swamy Ashram.. : సీఎం కేసీఆర్ శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామిని దర్శించుకున్నారు. శంషాబాద్ లోని ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్ సతీసమేతంగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తన ఆశ్రమానికి వచ్చిన కేసీఆర్ ను చిన్నజీయర్ స్వామి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సీఎం కేసీఆర్ కు శాలువా కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిన్నజీయర్ స్వామిని..యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవ మహోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను..ప్రధాని నరేంద్రమోడీలను,పలువురు కేంద్రమంత్రులను యాదాద్రి ఆలయ మహోత్సవానికి రావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ భగవత్ రామానుజాచార్య ప్రాజెక్టు విశేషాలనుతెలుసుకోనున్నారు. అలాగే ముచ్చింతల్ లో సీఎం కేసీఆర్ మొక్కలు నాటనున్నారు.అనంతరం మధ్యాహ్నాం యాదాద్రి వెళ్లనున్నారు. అలాగే సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకోనున్నారు.

Read more : ChinnaJeeyar : కేంద్రమంత్రులతో చిన్నజీయర్ భేటీ.. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని వినతి

కాగా..శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని దివ్యసాకేత ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ తిదండి చిన్నజీయర్‌స్వామి అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మహోత్సవానికి చిన్నజీయర్ స్వామి ప్రముఖులకు ఆహ్వానించారు. ప్రధాని మోడీ రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లతో పాటు, సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి ఎన్వీ రమణలతో పాటు  పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. భగవద్ రామానుజాచార్యుల జయంతి సహస్రాబ్ది వేడుకల సందర్భంగా సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో ప్రజలకు అంకితం చేయనున్నారు. శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని దివ్యసాకేత ఆశ్రమంలో 200 ఎకరాల్లో వేయి కోట్లతో ఈ అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Read more : ChinnaJeeyar : కేంద్రమంత్రులతో చిన్నజీయర్ భేటీ.. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని వినతి

కూర్చుని ఉన్న విగ్రహ రూపాల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్దది. స్టాట్చ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీగా ఏర్పాటు చేస్తోన్న 216 అడుగుల పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి 2022 ఫిబ్రవరి 2నుంచి 14 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 1,035 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు. దీని కోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు.రామానుజా మూర్తి విగ్రహ ఆవిష్కర మహోత్సవంలో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఆశ్రమంలో ఆధ్యాత్మికత వెల్లివిరచనుంది. ఇప్పటికే విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్ నగరానికి ఈ రామానుజా మూర్తి విగ్రహం మరింత పేరు తేనుంది.ఆధ్యాత్మిక నగరంగా కూడా పేరు తేనుంది.

సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన భగవత్‌ రామానుజాచార్యులు సామాజిక సంస్కరణాభిలాషిగా చెరగని ముద్ర వేశారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భగవంతుడు అందరివాడు అంటూ వారు చూపిన మార్గం అందరికీ ఆచరణీయం అన్నారు. సామాజిక చైతన్య ప్రభోదకులైన రామానుజుల వారి అతిపెద్ద ప్రతిమను ఏర్పాటు చేయడం ద్వారా వారి బోధనలు, సందేశం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుందని ఆకాంక్షించారు ఉపరాష్ట్రపతి.

1017వ సంవత్సరంలో జన్మించిన రామానుజాచార్య.. 120 ఏళ్లపాటు జీవించారు. భారతదేశమంతటా పర్యటించారు. విశ్వమంతా ఒకే కుటుంబంలా ఉండాలంటూ ప్రభోదించారు. ఆయన ప్రభోధనలను మరింతగా విస్తరించాలనే ఉద్ధేశ్యంతో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి రామానుజా చారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.