మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్

  • Published By: bheemraj ,Published On : December 15, 2020 / 11:01 AM IST
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్

Updated On : December 15, 2020 / 11:28 AM IST

Corona positive for Puwada Ajay Kumar : తెలంగాణలో మరో మంత్రి కరోనా బారిన పడ్డారు. RTPCR పరీక్షల్లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా సోకినట్లు పువ్వాడ అజయ్‌ ట్వీట్‌ చేశారు. తనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

తనను కలిసిన వారు… తనతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు దయచేసి కోవిడ్‌ పరీక్ష చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ ప్రేమే తనకు అసలైన వైద్యమని… దయచేసి తనకు ఫోన్ చేయడానికి, తనను కలుసుకోవడానికి ప్రయత్నించవద్దని కోరారు.

తన హెల్త్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటానన్న మంత్రి… ప్రస్తుతం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ట్వీట్‌ చేశారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని యథావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని వివరించారు.