Corona Second Wave: తెలంగాణలో 3వేల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులకు కరోనా!

దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. గత ఏడాదిని మించి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూహడలెత్తిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుంది. అన్ని రంగాల వారిపై మహమ్మారి తన పంజా విసురుతోంది.

Corona Second Wave: తెలంగాణలో 3వేల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులకు కరోనా!

Corona Second Wave

Updated On : April 26, 2021 / 4:04 PM IST

Corona Second Wave: దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. గత ఏడాదిని మించి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూహడలెత్తిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుంది. అన్ని రంగాల వారిపై మహమ్మారి తన పంజా విసురుతోంది. ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులతో పాటు బ్యాంకు సిబ్బందిలో కూడా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకర్లపై కొవిడ్ ప్రభావం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఇప్పటికే 3 వేల మందికిపైగా తెలంగాణ బ్యాంక్ ఉద్యోగులకు మహమ్మారి సోకింది.

బ్యాంకు సిబ్బంది అంటే ప్రజలు, ఖాతాదారులతో నేరుగా సంబంధాలు కలిగిన ఉద్యోగులు… ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కరోనాకు గురవుతున్నారు. నగదు లావాదేవీలు, పేపర్ వర్క్స్ ఇలా చేతులు మారడం కూడా వైరస్ వ్యాప్తికి మరో కారణమవుతుంది. ఈనెల ఒకటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో అన్ని బ్యాంకులకు చెందిన 3,238 మంది ఉద్యోగులకు కరోనా సోకగా.. అత్యధిక బ్రాంచ్​లు కలిగిన ఎస్బీఐ ఉద్యోగులే 1,028మంది కరోనా బారిన పడ్డారు. ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులలో ఇది స్వల్పంగా ఉండగా చిన్న పట్టణాలలోని బ్యాంకు సిబ్బందిని కూడా మహమ్మారి వదలడం లేదు.

వైరస్ వ్యాప్తి, కరోనా ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు పనివేళల్లో మార్పులు చేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది. మరోవైపు కరోనా బారిన పడుతున్న తమ ఉద్యోగులకు అండగా ఉండేలా కొన్ని బ్యాంకులు చర్యలు తీసుకొంటున్నాయి. డిజిటిల్ లావాదేవీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఖాతాదారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. కరోనా బారిన పడే తమ ఉద్యోగులకు పడకలు దొరక్కపోతే ప్రత్యామ్నాయంగా చికిత్స అందించేందుకు సికింద్రాబాద్​లోని శిక్షణశాలను తాత్కాలిక ఆస్పత్రిగా మార్చాలని ఎస్బీఐ నిర్ణయించింది.

Read: Corona Second Wave: కాలుతున్న కరోనా కాష్టం.. కాటికాపరులకే కన్నీరు!