Covid in Delhi:కోవిడ్ కేసులు కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయి..రెండురోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తాం : వైద్యశాఖా మంత్రి

కోవిడ్ కేసులు కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయని..రెండు మూడు రోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని ఢిల్లీ వైద్యశాఖా మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.

Covid in Delhi:కోవిడ్ కేసులు కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయి..రెండురోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తాం : వైద్యశాఖా మంత్రి

Painting On Cockroaches (1)

Updated On : January 12, 2022 / 1:47 PM IST

covid cases have stabilised in Delhi : ఢిల్లీలో కోవిడ్ కేసులు కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయి..కేసులు తగ్గుముఖం పడితే నగరంలో ఆంక్షలు ఎత్తివేస్తామని వైద్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.‘‘గత 24 గంటల సమయంలో 25,000 వరకు కేసులు వచ్చాయని..పాజిటివ్ రేటు ఆధారంగా కేసులు గరిష్ట స్థాయికి చేరాయని చెప్పలేమని.. పస్తుతం 25 శాతం పాజిటివ్ రేటు కొనసాగుతోందని ఇదే కొనసాగితే ఆంక్షలు ఎత్తివేస్తామని తెలిపారు.కరోనా కొత్త కేసులు స్థిరంగా ఉన్నాయని..త్వరలోనే తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. కోవిడ్ తో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య నిలకడగా ఉందని ఏమాత్రం పెరగలేదని ఇది చాలా మంచి పరిణామని అన్నారు.

Read more :  Delhi: ఉద్యోగాలపై ప్రభావం ఉండదు.. ఢిల్లీలో నో లాక్‌డౌన్ – కేజ్రీవాల్

నిపుణులు సూచనల మేరకు ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశామని..చాలా పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ముంబైలో ఇప్పటికే కేసులు తగ్గుముఖం పట్టడం మొదలైంది. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితిని త్వరలోనే చూస్తాం’’అని మంత్రి సత్యేంద్ర జైన్ ఆశాభావం వ్యక్తంచేవారు. కొత్త కేసుల సంఖ్య నిలకడగా ఉందని చూస్తుంటే కోవిడ్ కంట్రోల్ లోకి వస్తున్నట్లేగా ఉందని ఇలాగే ఉంటే రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో ఆంక్షల్ని ఎత్తివేస్తామని తెలిపారు.

కాగా..కోవిడ్ కేసులు పెరుగుతున్ క్రమంలో ఢిల్లీలోని ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయాలని..ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పంపాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ లాక్ డౌన్ ప్రకటిస్తారంటూ వచ్చిన వార్తల్ని సీఎం ఖండించారు. లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని ప్రజలు టెన్షన్ పడవద్దని సూచించారు.

Read more : TSRTC : అర్ధరాత్రి సజ్జనార్‌‌కు యువతి ట్వీట్

‘అమలు చేస్తున్న ఆంక్షలన్నింటినీ పరిస్థితులు అదుపులోకి వచ్చాక తీసేస్తామని తెలిపారు. ప్రస్తుతం హాస్పిటల్ లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందని.. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ఇప్పుడు ఆక్సిజన్ చాలా తక్కువ మందికి మాత్రమే అవసరం అవుతుంది. అదనంగా 37వేల బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముందస్తు జాగ్రత్తగా ఐసీయూ బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నా’మని ఢిల్లీ సీఎం అన్నారు.ఈక్రమంలో కేసులు నిలకడగా ఉండటంతో కేంద్రం కూడా ఢిల్లీలో ఆంక్షలు ఎత్తివేసే యోచనలో ఉంది.