Cricketer Ravindra Jadeja’s Wife : బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్న ర‌వీంద్ర జ‌డేజా భార్య !

క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య రీవా జ‌డేజా.. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అభ్య‌ర్థిగా ఆమె పోటీ చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణ‌యం ఇవాళ వెలుబ‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

Cricketer Ravindra Jadeja’s Wife : బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్న ర‌వీంద్ర జ‌డేజా భార్య !

Reeva Jadeja

Updated On : November 9, 2022 / 2:53 PM IST

Cricketer Ravindra Jadeja’s Wife : క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య రీవా జ‌డేజా.. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అభ్య‌ర్థిగా ఆమె పోటీ చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణ‌యం ఇవాళ వెలుబ‌డే అవ‌కాశాలు ఉన్నాయి. గుజ‌రాత్‌లో 27 ఏళ్ల నుంచి బీజేపీ పాల‌న కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.

రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ టిక్కెట్టు పొందే అవకాశం ఉంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈరోజు సమావేశం కానుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Supreme Court Chief Justice DY Chandrachud : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌స్టిస్ చంద్ర‌చూడ్

రీవా జ‌డేజా మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చ‌దివారు. ఆమె 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. ఆమె రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన కర్ణి సేనకు కూడా నాయకురాలు కావడం శోచనీయం. రీవా జ‌డేజా.. కాంగ్రెస్ మాజీ నేత హ‌రి సింగ్ సోలంకి బంధువు కావడం గమనార్హం.

అలాగే ఈసారి ఎన్నిక‌ల్లో హార్దిక్ ప‌టేల్‌, అల్పేశ్ థాకూర్‌లు కూడా బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. గుజరాత్‌లో డిసెంబ‌ర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. 8వ తేదీన ఫ‌లితాలు వెల్ల‌డించనున్నారు.