Car Stunt: కారుతో స్టంట్ కోసం ప్రయత్నించిన డ్రైవర్.. డివైడర్ దాటి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

కారుతో సినిమాల్లోలాగా స్టంట్లు చేసేందుకు ప్రయత్నించాడో డ్రైవర్. దీంతో కారు రోడ్డుపై డివైడర్ పైకెక్కి, అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Car Stunt: కారుతో స్టంట్ కోసం ప్రయత్నించిన డ్రైవర్.. డివైడర్ దాటి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

Car Stunt

Updated On : July 26, 2022 / 12:14 PM IST

Car Stunt: సినిమాల్లోలాగా స్టంట్లు చేయడం నిజ జీవితంలో సాధ్యమయ్యే పని కాదు. అలా ప్రయత్నిస్తూ చాలా మంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. బైకులు, కార్లపై స్టంట్లు చేయొద్దని, ఇది ప్రమాదకరమని, అలా చేస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు వినడం లేదు.

Clash In Pub: పబ్బులో యువకుడిపై అమ్మాయిల దాడి.. వీడియో వైరల్

తాజాగా ఇలాగే కారుతో స్టంట్ చేయడానికి ప్రయత్నించాడో డ్రైవర్. దీంతో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో జరిగింది. అమృత్‌సర్‌కు చెందిన ఒక వ్యక్తి సోలన్ జిల్లాలో ఐదో నెంబర్ జాతీయ రహదారిపై కారు డ్రైవింగ్ చేస్తూ స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. వెనకాల మరో కారులో దీన్ని వీడియో తీశారు. ఈ క్రమంలో అత్యధిక వేగంతో, నిర్లక్ష్యంగా కారు నడిపాడు డ్రైవర్. వేగంగా కారు నడుపుతూనే మధ్యలో డోర్ ఓపెన్ చేశాడు. ఏవో స్టంట్లు చేసేందుకు ప్రయత్నిస్తూ, ఉన్నట్టుండి కారును కొద్దిగా తిప్పాడు. అంతే.. వేగంగా కారు పక్కనే ఉన్న డివైడర్ పైకెక్కి, అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది.

Spurious Liquor: కల్తీ మద్యం సేవించి 25 మంది మృతి… మరో 40 మంది పరిస్థితి విషమం

రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని ఆగింది. ఈ ఘటనలో కారు భారీగా ధ్వంసమైంది. అయితే, అదృష్టవశాత్తు డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.