Earthquake : అండమాన్, నికోబార్ దీవులు, అఫ్ఘానిస్థాన్‌లో భూకంపం

అప్ఘానిస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. అఫ్ఘానిస్థాన్ దేశంలోని ఫైజాబాద్ ప్రాంతంలో సోమవారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 180 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో అప్ఘాన్ ప్రజలు భయాందోళనలు చెందారు....

Earthquake : అండమాన్, నికోబార్ దీవులు, అఫ్ఘానిస్థాన్‌లో భూకంపం

Earthquake hits Andaman

Earthquake : అప్ఘానిస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. అఫ్ఘానిస్థాన్ దేశంలోని ఫైజాబాద్ ప్రాంతంలో సోమవారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 180 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో అప్ఘాన్ ప్రజలు భయాందోళనలు చెందారు. (Earthquake hits Andaman and Nicobar Islands, Afghanistan) ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం సంభవించలేదని తాలిబన్ అధికారులు చెప్పారు.

Punjab : అక్రమాస్తుల కేసులో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం అరెస్ట్

అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. అండమాన్ దీవుల్లోని కాంప్ బెల్ బే ప్రాంతంలో సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. అండమాన్ దీవుల్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. 70 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అండమాన్ అధికారులు చెప్పారు. ఈ భూకంపాలతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.  ఈ భూకంపం వల్ల కొన్ని తాత్కాలిక ఇళ్లు దెబ్బతిన్నాయి.  అండమాన్ నికోబార్ దీవుల్లో తరచూ సంభవిస్తున్న భూకంపాలతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు.