Eatala To Delhi : ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఈటల.. నేడే బీజేపీలో చేరిక!
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం (జూన్ 14) ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.

Eatala To Delhi
Eatala Rajender to Delhi to Join BJP : తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం (జూన్ 14) ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ రోజు ఉదయం 11.30కి బీజేపీలో ఈటల చేరనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీకి వెళ్లారు. మొదట జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సమావేశం జరగనుంది. పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో ఈటల చేరనున్నారు. బీజేపీలోకి మరికొంతమంది ఇతర పార్టీల నేతలు కూడా చేరనున్నారు. ముందుగా జేపీ నడ్డాతో సంజయ్, కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు.
ఇప్పటికే ఈటల.. బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. తన నియోజకవర్గం హుజూరాబాద్‌లో అనుచరులతో చర్చలు జరిపారు. ఆ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరిగాయి. బీజేపీలో చేరేదెప్పుడు విషయంపై రేంజ్‌లో చర్చలు జరిగాయి. బీజేపీలో అధికారికంగా ఈటల చేరనున్నారు. ఆయనతో పాటు… హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు మరికొందరు ఇతర జిల్లాల నేతలు కూడా కమలం గూటికి చేరనున్నారు. ఈటల రాజేందర్, అతని అనుచరులతో పాటు.. లక్ష్మణ్, డీకే అరుణ, సోయం బాపూరావు, వివేక్, మురళీధర్‌రావు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం.
ఇప్పటికే బండి సంజయ్ ఢిల్లీ చేరుకున్నారు. జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈటల చేరిక అనంతర పరిణామాలు, హుజూరాబాద్ ఉప ఎన్నికపై చర్చించనున్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి, జేపీ నడ్డా భేటీ తర్వాత ఈటల బీజేపీలో చేరతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈటలతో పాటు.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి సహా.. మరికొందరు నేతలు బీజేపీలో చేరనున్నారు.