Andhra Pradesh: ఎట్ట‌కేల‌కు ఇళ్ళ‌కు చేరిన మచిలీపట్నం మత్స్యకారులు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కాంబెల్ పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు ఈ నెల 2న సముద్రంలో చేపల వేటకు వెళ్లి అంతర్వేది సమీపంలో పడవ ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అదృశ్యమైన విష‌యం తెలిసిందే.

Andhra Pradesh: ఎట్ట‌కేల‌కు ఇళ్ళ‌కు చేరిన మచిలీపట్నం మత్స్యకారులు

Boat

Updated On : July 8, 2022 / 7:46 AM IST

Andhra Pradesh: కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కాంబెల్ పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు ఈ నెల 2న సముద్రంలో చేపల వేటకు వెళ్లి అంతర్వేది సమీపంలో పడవ ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అదృశ్యమైన విష‌యం తెలిసిందే. వారు అదృశ్య‌మైన‌ప్ప‌టి నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు కొన‌సాగాయి. ఆ న‌లుగురు మ‌త్స్యకారులు ఎట్ట‌కేల‌కు ఇళ్ళ‌కు చేరుకున్నారు. అమలాపురం కొత్తపాలెం వద్ద సురక్షితంగా మత్స్యకారులు ఒడ్డుకు చేరారు.

Maharashtra: శివ‌సేన‌కు ఉద్ధ‌వ్ ఠాక్రేనే చీఫ్‌.. రెబ‌ల్ ఎమ్మెల్యేల గ్రూపున‌కు గుర్తింపులేదు: ఎంపీ సావంత్

వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక వాహనంలో తమ స్వగ్రామం క్యాంప్ బెల్ పేటకు వెళ్ళారు. వారి రాక‌కోసం ఎదురుచూస్తున్న గ్రామస్తులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కరగ్రహారం గ్రామంలో మత్స్యకారులను మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు, వైసీపీ యువ నేత పేర్ని కిట్టు, మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ క‌లిశారు. కరగ్రహారం బాబా ఫరీద్ మస్తాన్ అవులియా దర్గాలో మ‌త్య్స‌కారులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ న‌లుగురు మ‌త్స్య‌కారుల‌ను చూసి వారి కుటుంబ స‌భ్యులు భావోద్వేగానికి గురయ్యారు. వారికి హారతులు ఇచ్చారు.