Sarkaru Vaari Paata : ఈసారి ఎలాంటి అప్‌డేట్ లేదమ్మా..
‘సర్కారు వారి పాట’ నుండి మే 31న ఎలాంటి అప్‌డేట్ ఉండబోదని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు..

In View Of Current Circumstances There No Update From Sarkaru Vaari Paata
Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.. మహేష్ పక్కన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి..
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.. అయితే సూపర్‌స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మే 31న ‘సర్కారు వారి పాట’ నుండి అప్‌డేట్ రాబోతుందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి..
సాధారణంగా కృష్ణ గారి బర్త్‌డేకి మహేష్ కొత్త సినిమా అప్‌డేట్ వదలడం జరుగుతుంటుంది కాబట్టి ఈసారి కూడా అదే అవుతుంది అనుకున్నారు.. కట్ చేస్తే ‘సర్కారు వారి పాట’ నుండి మే 31న ఎలాంటి అప్‌డేట్ ఉండబోదని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాపిస్తున్న కారణంగా తమ సినిమా నుండి ఎలాంటి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఉండబోదని చెప్పారు.. ‘సర్కారు వారి పాట’ మూవీని 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇంతకుముందే ప్రకటించారు నిర్మాతలు..
ALERT!! ?@urstrulymahesh #SarkaruVaariPaata pic.twitter.com/kiKunIj8QC
— Team Mahesh Babu (@MBofficialTeam) May 26, 2021