Covid Cases: విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే 12 వేల కేసులు

వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం బుధవారం రోజు కరోనాతో 11 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 58,215 యాక్టివ్ కేసులున్నాయి. ఈ కేసుల శాతం 0.12గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 4,32,11,728 కేసులు నమోదుకాగా, 5,24,803 మంది మరణించారు.

Covid Cases: విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే 12 వేల కేసులు

Covid Cases

Updated On : June 16, 2022 / 1:22 PM IST

Covid Cases: దేశంలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,213 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం బుధవారం రోజు కరోనాతో 11 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 58,215 యాక్టివ్ కేసులున్నాయి. ఈ కేసుల శాతం 0.12గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 4,32,11,728  కేసులు నమోదుకాగా, 5,24,803 మంది మరణించారు. కరోనా నుంచి బుధవారం 7,624 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,26,74,712.

Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

దేశంలో కరోనా రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కేరళల్లోనే వరుసగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 4,204, కేరళలో 3,419 కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబైలోనే 2,293 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్త వేరియెంట్ అయిన బి.ఎ.5 వేరియెంట్ కూడా సోకుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో మొత్తం 195.53 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది. 12-14 ఏళ్ల వయసున్న టీనేజర్లకు కూడా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఈ వయసు పిల్లలకు ఇప్పటివరకు 3.53 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చారు. మరోవైపు ఈ స్థాయిలో భారీగా కరోనా కేసులు పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.