Itlu Maredumilli Prajaneekam: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’..!
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే టైటిల్‌తో వస్తున్న సినిమాలో నరేశ్ సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Itlu Maredumilli Prajaneekam Completes Censor Work
Itlu Maredumilli Prajaneekam: టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన ‘నాంది’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కాగా, తాజాగా ఆయన మరోసారి సీరియస్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే టైటిల్‌తో వస్తున్న సినిమాలో నరేశ్ సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా తెలుస్తోంది.
Itlu Maredumilli Prajaneekam: ఒకరోజు ముందే థియేటర్లలో వచ్చేస్తున్న మారుడమిల్లి ప్రజానీకం ట్రైలర్..!
ఇక ఈ సినిమాలో నరేశ్ పాత్రపై చిత్ర యూనిట్ ప్రశంసలు కురిపిస్తోంది. కాగా ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.