Jharkhand CM Hemant Soren: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. 31లక్షల మందికి సాయం ..

ఇక్కడి ప్రజల అస్తిత్వం, గౌరవంకోసం మన పూర్వీకులు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ సమయంలో వారు ఆగలేదు, అలసిపోలేదు. ప్రజలకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం కూడా వేగంగా ముందుకెళ్తుంది అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు.

Jharkhand CM Hemant Soren: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. 31లక్షల మందికి సాయం ..

Hemant Soren

Updated On : November 16, 2022 / 9:14 AM IST

Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ రాష్ట్ర 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతులకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గుడ్‌న్యూస్ చెప్పాడు. జార్ఖండ్ ఆవిర్భవించి 22ఏళ్లు పూర్తయిన సందర్భంగా మొరహబడి మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సోరెన్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని 226 కరువు ప్రాంతాల్లోని దాదాపు 31 లక్షల మంది రైతు కుటుంబాలకు కరువు సాయంకోసం తక్షణమే రూ.3,500 అందజేస్తామని అన్నారు. ప్రజలందరి సహకారంతో మనం సొంతంగా రాష్ట్రాన్ని బలంగా తీర్చిదిద్దుకుంటున్నామని అన్నారు. గతంలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేవికావని, ఈసారి రైతు సోదరులకు ముందుగానే ఎరువులు, విత్తనాలు అందించేందుకు మా ప్రభుత్వం కృషి చేసిందన్నారు.

Jharkhand CM Hemant Soren: మైనింగ్ లీజు కేసులో జార్ఖండ్ సీఎం సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఊరట..

ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోందని, ఇక్కడి ప్రజల అస్తిత్వం, గౌరవంకోసం మన పూర్వీకులు ఎన్నో పోరాటాలు చేశారని, ఆ సమయంలో వారు ఆగలేదని, అలసిపోలేదని సోరెన్‌ అన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కూడా వేగంగా కృషి చేస్తోందన్నారు. దీని కోసం ప్రభుత్వంలో నియామకాల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

Jharkhand CM Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు

నాణ్యమైన విద్యపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిసారించిందని సోరెన్ తెలిపారు. ఆడపిల్లల కోసం సావిత్రిబాయి ఫూలే కిశోరి సమృద్ధి యోజనను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని తొమ్మిది లక్షల మంది బాలికలను ఈ పథకంతో అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పథకం కింద బాలికలకు ప్రయోజనాలు కల్పిస్తున్నామని, 18 ఏళ్లు నిండితే వారికి ఏకమొత్తంలో రూ.40 వేలు అందజేస్తామన్నారు. రానున్న కాలంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక సాయం చేస్తుందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సి ఉండగా చివరి క్షణంలో ఆమె కార్యక్రమం రద్దయింది. గవర్నర్ రమేష్ బాయిస్ అనారోగ్యం కారణంగా పాల్గొనలేదని సోరెన్ తెలిపారు.