ఆత్మనిర్భర్-3.0లో 12 కొత్త నిర్ణయాలు .. ఎవరికి రిలీఫ్.. ఏంటి బెనిఫిట్స్?

12-point Stimulus 3.0 : ఆర్థిక పురోగతితో పాటు ఉపాధి, క్రెడిట్, మ్యాని ఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో మరింత ప్రోత్సాహాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్-3.0ను ప్రకటించింది. ఈ సహాయక ఉద్దీపన ప్యాకేజీ పథకం కింద 12 రకాల నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
అదనపు ఉద్దీపనలో సుమారు రూ.9 లక్షల కోట్లు, వైరస్ నుంచి రిలీఫ్ కోసం దాదాపు రూ .30 లక్షల కోట్లు లేదా స్థూల జాతీయోత్పత్తిలో 15శాతాన్ని కేటాయించనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన ఆత్మనిర్భర్ పథకంలో మూడవ దశలో భాగంగా 12 రకాల కొత్త నిర్ణయాలను ప్రకటించింది.
1. ఇల్లు కొనుగోలుదారులకు రిలీఫ్ :
సర్కిల్ రేటు, అగ్రిమెంట్ విలువ 10 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. జూన్ 30, 2021 వరకు ఇది వర్తిస్తుంది. రూ.2 కోట్ల వరకు విలువ కలిగిన ప్రైమరీ సేల్ రెసిడెన్షియల్ యూనిట్లపై మాత్రమే వర్తించనుంది.
* ఇప్పటివరకూ సర్కిల్ రేటు, అగ్రిమెంట్ విలువకు మధ్య 10 శాతం మాత్రమే అనుమతి ఉంది.
2. గ్రామీణ ఉపాధికి ప్రోత్సాహం :
గ్రామీణ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో పీఎం గరీభ్ కల్యాణ్ రోజ్ గర్ యోజన కింద అదనంగా రూ.10వేల కోట్లు అందించనుంది.
* MGNREGA పథకం కింద నేటి వరకు రూ.73,504 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో ఉపాధి హామీ కింద రూ. 251 కోట్లు వరకు గ్యారెంటీ అందిస్తోంది.
* ఇప్పటివరకూ పీఎం గరీభ్ కల్యాణ్ రోజ్ గర్ యోజన కింద 116 జిల్లాల్లో రూ.57,543 కోట్లు ఖర్చు చేసింది.
3. రైతులకు ఫెర్టిలైజర్ రాయితీలు :
* రైతులకు ఫెర్టిలైజర్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా రూ.65వేలు వరకు ఫెర్టిలైజర్ రాయితీలను ప్రకటించింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎం గరీభ్ యోజన కింద అదనంగా రూ.10వేల కోట్లు అందించనుంది.
* ప్రాజెక్ట్ ఎక్స్ పోర్టుల ప్రమోషన్ కోసం మరో రూ.3 వేల కోట్లు EXIM బ్యాంకుకు విడుదల చేసింది.
4. కొత్త ఉద్యోగాలపై హామీ :
* సంస్థల్లో కొత్త ఉద్యోగాల నియామకాలను ప్రోత్సాహించే దిశగా కంపెనీలకు రాయితీలను ఇవ్వనుంది.
* ఉద్యోగులతో పాటు కంపెనీలకు కూడా రిటైర్మెంట్ ఫండ్, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ 12శాతం, ఎంప్లాయిర్ కాంట్రీబ్యూషన్ 12 శాతం రెండేళ్ల పాటు సబ్సిడీ కల్పించనుంది.
* EPFO రిజిస్టర్డ్ కంపెనీల్లో కొత్త ఉద్యోగుల నియామకం ద్వారా ఈ రాయితీ పొందవచ్చు.
* ఎవరైనా కొత్త ఉద్యోగి నెలవారీ వేతనం రూ.15 వేల కంటే తక్కువగా ఉండాలి.
* ఈ పథకం జూన్ 30, 2021 వరకు అందుబాటులో ఉంటుంది.
5. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ పొడిగింపు :
* ELGS 1.0ను మార్చి 31, 2021 వరకు పొడిగించారు.
* ఈ స్కీమ్ పూర్తిగా నమ్మకమైనది, ఉచితం కూడా
* కంపెనీల్లో ఔట్ స్టాండింగ్ లోన్లపై అదనంగా 20 శాతం వరకు క్రెడిట్ పొందవచ్చు.
* కంపెనీల్లో రూ.50 కోట్లు వరకు ఔట్ స్టాండింగ్ కలిగి ఉండి.. వార్షిక టర్న్ ఓవర్ రూ.250 కోట్లు ఉండాలి.
* MSME, బిజినెస్ ఎంటర్ ప్రైజెస్, వ్యాపారపరంగా వ్యక్తిగత లోన్లు, MUDRA రుణదారులకు అర్హత
* ECLGS 1.0 పథకం కింద 61 లక్షల రుణాదారులకు రూ.2.05 లక్షల కోట్లు మంజూరు కాగా.. మొత్తంగా రూ.1.52 లక్షల కోట్లు.
* ఈ స్కీమ్ మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటుంది.
6. చెైనాకు ధీటుగా కొత్త ప్లాన్ :
* ప్రస్తుత ఐదేళ్ల PLI స్కీమ్‌ను మరో పది రంగాలకు పొడిగింపు
* ఇందుకోసం రూ.1.46 లక్షల కోట్లు కేటాయింపు
* దేశీయ వ్యాపారంలో చైనాను దూరం పెట్టడంపైనే ప్రత్యేక దృష్టి
7. పీఎం అవాస్ యోజన అర్బన్ (PMAY-U) :
* PMAY-Uలో భాగంగా 2020-21 బడ్జెట్ అంచనాగా రూ.18వేల కోట్లు అదనపు కేటాయింపు
* ఈ ఏడాది ఆరంభం నుంచి రూ.8వేల కోట్లుకు పైనే కేటాయింపు
* 78 లక్షల ఉద్యోగాల కల్పనపై అంచనా.
8. కాంట్రాక్టర్లకు రిలీఫ్ :
* కాంట్రాక్టరకు ప్రభుత్వ టెండర్లలో EMD, performance security కింద మూలధన తగ్గింపు
* పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కింద కాంట్రాక్టలపై 3 శాతం తగ్గింపు, వివాదాలు లేని కాంట్రాక్టులపై పొడిగింపు
* టెండర్లకు EMD అవసరం లేదు. దీని స్థానంలో బిడ్ సెక్యూరిటీ డిక్లరేషన్
* సాధారణ ఆర్థిక నిబంధనల కింద డిసెంబర్ 31, 2021 వరకు సడలింపు
9. వ్యాక్సిన్ పరిశోధన కోసం :
* కోవిడ్-19 వ్యాక్సిన్ రీసెర్చ్ కోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి రూ.900 కోట్లు మంజూరు
* వ్యాక్సిన్ ఖరీదు, పంపిణీ ఖర్చులకు ఈ వర్తించదు.
10.) మౌలిక సదుపాయాలపై రుణాలు :
NIIF, NBFC ఇన్ ఫ్రా డెబ్డ్ ఫండ్, NBFC ఇన్ ఫ్రా ఫైనాన్స్ కంపెనీలతో కూడిన డెబ్ట్ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేసింది.
* ఈ ప్లాట్‌ఫామ్‌లో రూ .8,000 కోట్ల రుణం, పైప్‌లైన్ కోసం రూ .10,000 కోట్ల ఒప్పందం
* NIIF AIFL (AA రేటింగ్) IFL (AAA రేటింగ్) ప్రాజెక్ట్ బాండ్లతో సహా మార్కెట్ నుంచి రూ. 95,000 కోట్ల రుణాన్ని సేకరించనున్నాయి.
* 2025 నాటికి రూ.1,10,000 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఫైనాన్సింగ్‌ను అందిస్తుంది.
* ప్లాట్‌ఫామ్ ఈక్విటీలో NIIF ఇప్పటికే దాదాపు రూ .2,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ప్రభుత్వం రూ .6,000 కోట్లు ఈక్విటీగా పెట్టుబడి పెట్టనుంది. మిగిలినవి ప్రైవేట్ పెట్టుబడిదారుల నుంచి సేకరించనుంది.
* దిగువ నిధులు, ప్లాట్‌ఫాంలు, ఆపరేటింగ్ కంపెనీలలో మూడు NIIF ఫండ్లతో వాస్తవ పెట్టుబడులు రూ .18,676 కోట్లు.
11.) మూలధన, పారిశ్రామిక ఉద్దీపన :
దేశీయ రక్షణ పరికరాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలతోపాటు హరిత శక్తి కోసం మూలధన పారిశ్రామిక వ్యయాల కోసం రూ.10,200 కోట్ల అదనపు బడ్జెట్ అందించనుంది.
12.) ప్రాజెక్ట్ ఎగుమతులపై ప్రోత్సాహం :
ఐడియాస్ పథకం కింద లైన్ల క్రెడిట్ (LOC) ద్వారా ప్రాజెక్టు ఎగుమతులను ప్రోత్సహించడానికి రూ .3,000 కోట్లు EXIM బ్యాంక్‌కు విడుదల చేయనుంది.
* ఐడియాస్ పథకం కింద అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయంగా EXIM బ్యాంక్ ప్రభుత్వం తరపున ఎల్‌ఓసిని విస్తరించింది.
* LOC కింద 75 శాతం విలువతో దిగుమతి కోసం భారత ఎగుమతిని ప్రోత్సహిస్తుంది.