Sarkaru Vaari Paata: సెంచరీ కొట్టిన కళావతి.. మహేష్ స్టెప్స్‌కు జనం ఫిదా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో.....

Sarkaru Vaari Paata: సెంచరీ కొట్టిన కళావతి.. మహేష్ స్టెప్స్‌కు జనం ఫిదా!

Kalaavathi Song From Sarkaru Vaari Paata Touches 100 Million Views On Youtube

Updated On : March 22, 2022 / 4:30 PM IST

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ వస్తోన్న మహేష్ బాబు, ఈ సినిమా టైటిల్ మొదలుకొని ఆయన ఫస్ట్‌లుక్ వరకు అన్నీ వైవిధ్యంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ అదిరిపోయే క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమా నుండి ‘కళావతి’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ప్రేమికుల రోజు కానుకగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Sarkaru Vaari Paata: పైసా వసూల్ అప్‌డేట్‌తో వస్తున్న ‘సర్కారు వారి పాట’

ఈ పాటకు థమన్ అందించిన సంగీతం ఒక ఎత్తైతే.. సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడిన తీరు మరో ఎత్తు. ఇక ఈ పాటకు మహేష్ వేసిన స్టెప్స్‌కు ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫుల్ ఫిదా అయ్యారు. మహేష్ వేసిన స్టెప్స్ చాలా ఈజీగా ఉండటమే కాకుండా పాటకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ సింక్‌లో ఉండటంతో ఈ స్టెప్స్‌తో జనం సోషల్ మీడియాలో దుమ్ములేపారు. ఇలా ఈ పాటకు ఎక్కడలేని క్రేజ్ రావడంతో తాజాగా ‘కళావతి’ పాట ఓ సరికొత్త మైల్‌స్టోన్‌ను అందుకుంది. కళావతి లిరికల్ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను టచ్ చేయగా 1.7+ మిలియన్ లైకులను సంపాదించింది. మహేష్ బాబు క్రేజ్‌కు ఇదొక నిదర్శనం అని అంటున్నారు ఆయన అభిమానులు. ఇక ఇటీవల ‘పెన్నీ’ అనే రెండో సాంగ్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Sarkaru Vaari Paata : ‘కళావతి’ పాటకి తమన్ స్టెప్పులు.. అదరగొట్టావంటూ మహేష్ అభిమానులు

సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ బాబు పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ ముందు నుండీ చెబుతూ వస్తోంది. కాగా ఈ సినిమాలో ఆయన సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తవగా, వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ముగించేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.