Marriage Problems for young mens : ‘వయస్సు దాటిపోతోంది పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకట్లేదు సార్’ అంటూ మాజీ సీఎంకు యువకుడి లేఖ..
‘వయస్సు దాటిపోతోంది పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకట్లేదు సార్’ అంటూ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి లేఖ రాశాడు ఓ యువకుడు. దీనికి మీరే పరిష్కారం చూపించాలంటూ అభ్యర్థించాడు.

karnataka kolar youth requests to EX CM HD kumaraswamy
Marriage Problems for young mens : పెళ్లి చేసుకునే వయస్సు దాటిపోతోంది. కానీ పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకట్లేదు సార్ అంటూ మాజీ సీఎంకు ఓ యువకుడి లేఖ ద్వారా విన్నవించుకున్నాడు. కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి వద్దకు తమ తమ సమస్యలు చెప్పుకోవటానికి ఎంతోమంది వస్తుంటారు ప్రతీరోజు. వైద్యం కోసం సహాయం చేయాలని..తమకు సొంత ఇళ్లు కావాలని ఇలా పలుసమస్యలను చెప్పుకుంటుంటారు. వారి వారి సమస్యలు తెలుసుకుంటుంటారు కుమారస్వామి. బాధితులు ఇచ్చే లేఖలను పరిశీలిస్తుంటారు. అలా వచ్చిన లేఖలో ఓ యువకుడు తనకు పెళ్లి చేసుకోవటానికి అమ్మాయి దొరకటంలేదు సార్అంటూ రాసుకొచ్చాడు.
కోలారు జిల్లా పంచరత్న యాత్రలో కుమారస్వామి.. గ్రామస్తులు, రైతుల కష్టాలు వింటున్నారు. అదే సమయంలో ముదువతి గ్రామానికి చెందిన ధనంజయ అనే యువకుడు కుమార స్వామికి ఓ వినతిపత్రం ఇచ్చాడు. పెళ్లి చేసుకోవడానికి వధువులు దొరకడం లేదంటూ ఆ లేఖలో రాసుకొచ్చాడు. ‘ఒక్కలిగ’ రైతు యువకులకు పెళ్లి వయసు దాటినా వధువులు రావడం లేదని, ఒక్కలిగ యువకులకు వధువుల కొరతగా ఉన్నారని ఈ సమస్య పరిష్కరించాలంటూ అభ్యర్థించాడు.
‘కోలార్‌లో రైతు యువకులు వధువుల కొరతను ఎదుర్కొంటున్నారు. మీరు సీఎం అయ్యాక జిల్లాకు చెందిన వధువులను ఇతర జిల్లాలకు చెందిన వరులను పెళ్లి చేసుకోకూడదనే నిబంధనను అమలు చేయాలని కోరాడు.మీరు మాకు వధువులను వెతకాలి’ అని ధనంజయ కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కుమారస్వామి సీఎం కావడం ఖాయమని, జేడీఎస్ ప్రభుత్వంలో ఈ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ధనంజయ లేఖలో కోరాడు. పెళ్లి వయసు దాటినా వధువు లభించకపోవడం సంక్లిష్టమైన, విచిత్రమైనప్పటికీ.. ధనంజయ విజ్ఞప్తి సామాజిక సమస్య ప్రస్తుత సమస్యకు అద్దంపట్లేలా ఉంది.
కాగా..ఇటీవల నాగమంలలోని ఆదిచూచనగిరి మఠం ఆవరణలో జరిగిన రాష్ట్రస్థాయి ఒక్కలిగ వధూవరుల సమ్మేళనంలో 25 వేల మందికి పైగా పాల్గొనగా.. 25వేల మంది ఒక్కలిగ కుర్రాళ్లు వధువు కోసం తరలిరావడం చర్చనీయాంశమైంది. అదొక జాతరలా సాగింది. కేవలం 200 మంది అమ్మాయిలు మాత్రమే పాల్గొనగా, 11,750 మంది అబ్బాయిలు పాల్గొన్నారు. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.