మే3 తర్వాత లాక్‌డౌన్ పొడిగింపు

రోజూ పెరుగుతున్న COVID-19 కేసులు కారణంగా మే3 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగించే యోచనలో ఉంది కేంద్రం. సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న ప్రధాని మోడీ దాదాపు ఇవే సూచనలు చేసినట్లు సమాచారం. దీనిని ఎన్ని రోజులు పొడిగిస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. హాట్ స్పాట్లుగా మారిన ప్రాంతాల్లో కచ్చితంగా పొడిగిస్తూ.. గ్రీన్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో సడలింపు చేసే అవకాశాలు ఉన్నాయి.
రెండో దశ లాక్‌డౌన్ పూర్తికాకముందే గ్రీన్ జోన్లుగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నిషేదాజ్ఞలు ఎత్తివేస్తారు. మిగిలిన జిల్లాల్లో కొద్దిపాటి షరతులతో కూడిన లాక్‌డౌన్ విధిస్తారు. తప్పనిసరి ఆర్థిక వ్యవహరాలకు మాత్రమే అనుమతులిస్తారు. రాష్ట్రాల్లో అంతర్గత రవాణాపే అనుమతిస్తారు. అదే విధంగా రైళ్లు, విమాన సర్వీసులు గ్రీన్ జోన్లుగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే రాకపోకలు ఉంటాయి.
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోడీ భారత ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఇంకా మెరుగైన స్థితిలోనే ఉన్నామని అన్నారు. ఆర్థిక శఆఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మీటింగ్ లో మాట్లాడారు. రాష్ట్రాలు అడిగిన ఎకానమీ ప్యాకేజీలపై కేంద్రం చెప్పిన విషయంపై క్లారిటీ లేదు.
ఒకటిన్నర కాలంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా వేల కొలదీ ప్రాణాలు కాపాడామని మోడీ మీటింగ్ లో చెప్పారు. అనేక దేశాలతో పోలిస్తే భారతదేశ జనాభా చాలా పెద్దది. దేశం వారిని కాపాడుకుంటుంది. వేసవికాలం, వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని వాతావరణ మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు.
సామాన్య పౌరులను బ్రతికించుకుంటూ.. మళ్లీ సమాజాన్ని యథాస్థానంలోకి తీసుకురాగలగాలని ముఖ్యమంత్రులతో మాట్లాడారు మోడీ. కేరళ లాంటి రాష్ట్రాలు విదేశాల నుంచి తమ వాళ్లను తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అది దృష్టిలో ఉంచుకునే వారి కోసం చార్టర్డ్ విమానాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మీటింగ్ జరిగిన సమయానికి 26వేల 917కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే వెయ్యి 945కేసులు నమోదుకావడం గమనార్హం. 826మంది మృతి చెందారు. మే 15నాటికి 65వేల covid-19కేసులు నమోదవుతాయని కేంద్రం చెబుతుంది.
సోమవారం మీటింగ్ లో మేఘాలయ, మిజోరాం, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, గుజరాత్, హర్యానాల ముఖ్యమంత్రులు పాల్గొని మాట్లాడారు. ఇతర ముఖ్యమంత్రులు తమ చీఫ్ సెక్రటరీలను లేదా మంత్రులను సమావేశంలో పాల్గొనేట్లుగా చేశారు. చాలా రాష్ట్రాలు ఆరోగ్యానికి సంబంధించనవే ఎక్కువగా అడిగాయి. PPEలు, test kitలు సమకూర్చాలని వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకునేందుకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేశాయి.