లాక్ డౌన్: మే17 వరకు ప్యాసింజర్ రైళ్ల ప్రయాణాలపై నిషేధం

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మే 17, 2020 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ప్యాసింజర్ రైలు ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు భాతర రైల్వే శాఖ ప్రకటించింది. అయితే వలస కార్మికులు, యాత్రికులు, టూరిస్టులు, విద్యార్థులు, వేర్వేరు చోట్ల ఉన్నవారి కోసం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడుపుతామని వెల్లడించింది.
సబర్బన్ రైళ్లు కూడా మే 17 వరకు నడవబోవని తేల్చి చెప్పారు. ప్రయాణికులెవరూ టికెట్ బుకింగ్ ల కోసం ఏ రైల్వే స్టేషన్ నూ విజిట్ చేయరాదని తెలిపింది. శ్రామిక్ రైళ్ల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోటోకాల్ పాటించాలని సూచించింది. అయితే వీటి మధ్య సమన్వయం కోసం సీనియర్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. కాగా రవాణా, పార్సిల్ రైళ్లు యధావిధిగా నడుస్తాయని రైల్వే శాఖ తెలిపింది.
భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతన్నాయి. రోజురోజుకు కేసులు అధికమవుతున్నాయి. దేశంలో 37 వేల 776 కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 2 వేల 293 మంది వైరస్ బారిన పడ్డారు. దేశంలో మృతుల సంఖ్య 1223కి చేరింది. 10 వేల 17 కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. 26, 535 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రాల పరంగా చూస్తే మహారాష్ట్రలో కేసుల సంఖ్య వేగంగా పెరుుగుతోంది. 11 వేల 506 మందికి పైగా బాధితులు ఉన్నారు. కరోనాతో 485 మంది మరణించారు. ముఖ్యంగా ముంబాయిలో పరిస్థితి తీవ్రంగా ఉంది. గుజరాత్ లో కూడా వైరస్ వేగం ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో 4721 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. 236 మంది చనిపోయారు. 3738 మంది వైరస్ బాధితులు ఉన్నారు.