Maharashtra: బలపరీక్షలో ఏక్నాథ్ షిండే విజయం
బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడంతో ఆయనకు 164 ఓట్లు వచ్చాయి. ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరం ఉన్నారు.

Maha Assembly
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బలపరీక్షలో విజయం సాధించారు. అసెంబ్లీలో ఆయన విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాక కౌంటింగ్ చేపట్టారు. ఏక్నాథ్ షిండేకు మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గాలంటే 144 ఓట్లు వస్తే చాలు. కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. ఏక్నాథ్ షిండే శివసేన పార్టీకి ఎదురుతిరిగి హోటల్లో క్యాంపు ఏర్పాటు చేశారు. దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని ఆయన కొన్ని రోజులుగా చెబుతున్నారు.
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు శివసేన
బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడంతో ఆయనకు 164 ఓట్లు వచ్చాయి. ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరం ఉన్నారు. తమకు వ్యతిరేకంగా ఓట్లు వేసే శివసేన నేతలపై అనర్హత వేటు వేయించడానికి పక్రియ చేపడతామని ఏక్నాథ్ షిండే వర్గంలోని శివసేన చీఫ్ విప్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన విప్ జారీ చేశారు. అయినప్పటికీ కొందరు శివసేన ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు.