Sarkaru Vari Pata: మే 31న అభిమానులకు మహేష్ సర్ ప్రైజ్!

మహేష్ తన పుట్టినరోజును ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో పెద్దగా బయటకు రానివ్వరు కానీ ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున మాత్రం ఘనంగా జరుపుకుంటారు. పనిలో పనిగా ఆ రోజున తన సినిమాలకు సంబంధించి ఏదొక అప్ డేట్ ఇచ్చి ఆయన అభిమానులను కూడా సర్ ప్రైజ్ చేస్తుంటాడు.

Sarkaru Vari Pata: మే 31న అభిమానులకు మహేష్ సర్ ప్రైజ్!

Mahesh Surprise To Fans On May 31

Updated On : May 17, 2021 / 11:16 AM IST

Sarkaru Vari Pata: మహేష్ తన పుట్టినరోజును ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో పెద్దగా బయటకు రానివ్వరు కానీ ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున మాత్రం ఘనంగా జరుపుకుంటారు. పనిలో పనిగా ఆ రోజున తన సినిమాలకు సంబంధించి ఏదొక అప్ డేట్ ఇచ్చి ఆయన అభిమానులను కూడా సర్ ప్రైజ్ చేస్తుంటాడు. ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు కావడంతో మరోసారి అభిమానులకు సర్ ఫ్రైజ్ ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది.

గత ఏడాది పరశురామ్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా టైటిల్ ప్రకటించి తండ్రికి మంచి గిప్ట్ ఇచ్చారు. ప్రతి పుట్టినరోజు లాగానే ఈ సారి కూడా తన కొత్త సినిమా టీజర్ రూపంలోనో, లేదా కనీసం తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ తోనే, మహేష్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా ప్రకటన కూడా మేడే నాడే స్పెషల్ గా ఎనౌన్స్ చేశారు.

మరి ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఏదైనా పోస్టర్, టైటిల్ ప్రకటిస్తారా.. లేక ఈ ఏడాది కూడా సర్కారు వారిపాటకు సంబంధించి ఏదైనా ట్రీట్ ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది. కాగా, దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేష్ ఓ సినిమా చేయనున్నాడని.. ఆ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారని ఈ మధ్య ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథా చర్చలు పూర్తవగా సర్కారు వారి పాట పూర్తయిన తర్వాత ఈ సినిమా మీద ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.