31స్ట్ నైట్ దావత్ కోసం అప్పు..వైరల్ అవుతున్న ప్రాంశరీ నోటు

31స్ట్ నైట్ దావత్ కోసం అప్పు..వైరల్ అవుతున్న ప్రాంశరీ నోటు

Updated On : January 2, 2021 / 12:43 PM IST

Telangana  Man New Year Celebration Debt on promissory note :డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు జనాలంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ముందుగానే ప్లాన్ చేసేసుకుంటారు. ఎక్కడికెళ్లాలి? ఎవరెవరు ఎక్కడ కలవాలి? పార్టీ ఎలా చేసుకోవాలి? అని ముందే ప్లాన్ చేసేసుకుంటారు. ఈ ఎంజాయ్ మెంట్ కోసం డబ్బులు కూడా భారీగా ఖర్చుపెడుతుంటారు. చేతిలో డబ్బులు లేకపోతే అప్పు చేసి కూడా పార్టీలు చేసుకుని రాత్రంతా వేలకు వేలు ఖర్చు చేసి ఎంజాయ్ చేస్తున్నారు.

కానీ చేతిలో డబ్బులు లేకపోతే అప్పులు చేయటం సాధారణమే కాదు. కానీ ఈ కరోనా సమయంలో కూడా న్యూ ఇయర్ పార్టీ కోసం..ఓ వ్యక్తి ప్రామిసరీ నోటు ప్రాంశరీ నోటు మీద ‘31స్ట్ నైట్ దావత్ కోసం రూ.15000’ అని అప్పు చేయటం విశేషంగా మారింది. దీనికి సంబంధించిన ప్రామిసరీ నోటు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏదో అర్జంట్ అయితే ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టి అప్పు తీసుకుంటారు. కానీ ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఇలా అప్పు చేస్తారా? అని తెగ ఆశ్చర్యపోతున్నారు జనాలు. ఈ ప్రామిసరీ నోటు ఫోటోలో స్పష్టంగా ‘31స్ట్ నైట్ దావత్ కోసం రూ.15000’ అని రాసి ఉంది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా ఈ నోటుపై అప్పు తీసుకున్న వ్యక్తి ఎవరో తెలీదుగానీ.. తెలంగాణకు చెందిన వ్యక్తిలా అనిపిస్తున్నాడు. కారణం ఈ నోటుపై తెలుగులో రాసి ఉండటం..పైగా దావత్ అనే మాట తెలంగాణలోనే వాడుతుంటారు. అందుకే అది తెలంగాణాలకు చెందిన వ్యక్తే అనుకోవచ్చు..