Mega Brothers : మెగా బ్రదర్స్ పిక్ అదిరిందిగా..!
నేడు (మే 24) బ్రదర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. తమ్ముళ్లు నాగ బాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి ఉన్న అరుదైన ఫొటో షేర్ చేశారు..

Megastar Chiranjeevi Wishing Every One A Happy Brothers Day
Mega Brothers: మెగాస్టార్ చిరంజీవి గతకొంత కాలంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు.. పోయిన సంవత్సరం లాక్‌డౌన్ టైం లో కుకింగ్, గార్డెనింగ్ వంటి పనులు చేస్తూ.. ఆ వీడియోలను షేర్ చేశారు.
తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటించాలంటూ వీడియో ద్వారా తెలియచేశారు. అలాగే ఈ కష్టకాలంలో సినిమా పరిశ్రమకు చెందిన వారితో పాటు తన అభిమానులకు, వారి కుటుంబాలకు అన్ని రకాలుగా సాయమందిస్తున్నారు.
నేడు (మే 24) బ్రదర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. తమ్ముళ్లు నాగ బాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి ఉన్న అరుదైన ఫొటో షేర్ చేశారు. ఆ పిక్‌లో చిన్ననాటి పవన్‌ను ఎత్తుకుని ఉన్నారు. మెగాస్టార్ షేర్ చేసిన రేర్ పిక్ మెగాభిమానులతో పాటు నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది..
తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి,
Happy Brothers day! pic.twitter.com/X6kmJKTo3P— Chiranjeevi Konidela (@KChiruTweets) May 24, 2021