Rajya Sabha: పెద్దల సభలో నేరస్తులు..!

ఇద్దరు ఎంపీలపై హత్యానేరం అభియోగాలు ఉండగా, మరో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయి. మరో నలుగురు ఎంపీలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభియోగాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్‌పై అత్యాచార అభియోగం నమోదైంది.

Rajya Sabha: పెద్దల సభలో నేరస్తులు..!

Rajya Sabha

Rajya Sabha: పార్లమెంటులో పెద్దల సభగా పిలిచే రాజ్యసభలో 71 (31 శాతం) మంది సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. వీరిలో 37 (16 శాతం) మంది ఎంపీలపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ అనే సంస్థ నివేదికలో తేలింది.

AB Venkateshwar Rao: మరోసారి ఏబీవీని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

ఈ నివేదిక ప్రకారం.. ఇద్దరు ఎంపీలపై హత్యానేరం అభియోగాలు ఉండగా, మరో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయి. మరో నలుగురు ఎంపీలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభియోగాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్‌పై అత్యాచార అభియోగం నమోదైంది. ఆయన రాజస్తాన్‌కు చెందిన ఎంపీ. బీజేపీకి చెందిన 20 మందిపై, కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మందిపై, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురిపై, ఆర్జేడీకి చెందిన ఐదుగురిపై, సీపీఎంకు చెందిన నలుగురిపై, ఆమ్ ఆద్మీకి చెందిన ముగ్గురిపై, వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురిపై, ఎన్సీపీకి చెందిన ఇద్దరు సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయి.

Pallonji Mistry: వ్యాపారవేత్త పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

ఈ వివరాల్ని ఆ సభ్యులే తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తం 28 మంది ఎంపీలపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. రాజ్యసభ సభ్యుల్లో 87 శాతం అంటే 197 మంది కోటీశ్వరులే. వీరు కనీసం కోటి రూపాయలకు పైగా ఆస్తి కలిగి ఉన్నారు. రాజ్యసభ సభ్యుల సగటు ఆస్తి రూ.79.54 కోట్లుగా ఉంది. మొత్తం 233 రాజ్యసభ సభ్యులకుగాను, 226 మంది సభ్యుల ఆర్థిక నేపథ్యాన్ని, నేర చరిత్రను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు.