రీల్ కాదు రియల్ ‘శుభలగ్నం’..రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసింది

రీల్ కాదు రియల్ ‘శుభలగ్నం’..రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసింది

Updated On : January 5, 2021 / 11:02 AM IST

MP: Wife husband to marry lover in exchange for Rs 1.5 crore : ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోవచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘శుభలగ్నం’ సినిమా గుర్తుంది కదూ. ఆ సినిమాలో భర్త జగపతిబాబుని ఆమని రూ.కోటికి అమ్మేసిన సీన్ చాలా చాలీ కీలకం. ఆ సీన్ మరచిపోలేం. అది సినిమా మాత్రమే. కానీ రియల్ ‘శుభలగ్నం’ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. ఓ భార్య తన భర్తను మరో స్త్రీకి అమ్మేసింది.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకున్న ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక మహిళ రూ. 1.5 కోట్ల రూపాయలు తీసుకుని తన భర్తను మరో మహిళకు సొంతం చేసిన ఘటన భోపాల్ ఫ్యామిలీ కోర్టులో జరిగింది. ఈ కేసు స్థానికంగా సంచలనం కలిగించింది.

ఈ కేసుకు సంబంధించి ఒక బాలిక…తన తండ్రి అతని ఆఫీసులో పనిచేసే ఒక మహిళతో సంబంధం పెట్టుకుని..మా అమ్మతో అస్తమాను గొడవ పడుతున్నాడని వారి గొడవలతో ఇంట్లో ప్రశాంతత లేకుండాపోయింది ఫిర్యాదు చేసింది. వాళ్ల గొడవలతో ఇంట్లో తాను..తన చెల్లెలు చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నామని..దయచేసిన దీనికొక పరిష్కారాన్ని చూపి పుణ్యం కట్టుకోవాలని ఫిర్యాదుచేసింది. ఓ బాలిక వచ్చి తన తల్లిదండ్రులపై ఫిర్యాదు చేయటానికి దానికి చెప్పిన కారణాలను బట్టి ఫ్యామిలీ కోర్టు బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ప్రారంభించింది.

ఈ ఆ బాలిక తల్లిదండ్రులను ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పిలిపించారు. ఆ బాలిక చెప్పిందంతా నిజమేనని తేలింది. తండ్రికి మరొక స్త్రీతో సంబంధం ఉందని తేలింది. పైగా అతను ఆ మహిళతోనే తాను ఉండాలనుకుంటున్నట్లు సదరు భర్త స్పష్టంగా చెప్పాడు. దీనికి అతని భార్య ఒప్పుకోలేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక నువ్వు నీదారి చూసుకుంటే ఈ పిల్లల్ని నేనెలా పోషించాలి? ఎలా చదివించాలి? వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ఇద్దరు పైనా ఉంది. ఇప్పుడు నువ్వు వేరే మహిళతో సంబంధం పెట్టుకుని ఆమెతోనే ఉంటానంటే పిల్లల భవిష్యత్తు ఏంకావాలని ప్రశ్నించింది.

ఆమె చెప్పిన కారణాలు నూటిని నూరుశాతం నిజమైనవే కాబట్టి దీనికి నువ్వేమంటావని నిర్వాహకులు అడిగారు. కానీ ఆ భర్త మాత్రం నేను నా ప్రియురాలితోనే ఉంటానని చెబుతున్నాడు. దీంతో ఈ సమస్య పరిష్కారం కోసం పలుమార్లు సదరు భార్యా భర్తను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కానీ ఎక్కడా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అలా చిట్ట చివరకు ఒక షరతుమీద ఆ భార్య ఒక షరతుపై భర్తకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోవటంతో సమస్యకు పరిష్కారం దొరికింది.

తాను భర్తను ఆమెకు అప్పగించాలంటే సదరు ప్రియురాలు తనకు ఒక ఖరీదైన ఫ్లాట్‌తో పాటు రూ. 1.5 కోట్ల లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పుడే తన భర్తను ఆమెకు అప్పగిస్తారని స్పష్టం చేసింది. ఈ షరతుకు భర్త ప్రియురాలు ఒప్పుకున్నట్లు సమాచారం. కానీ ఈ డీల్ కు చిన్న సవరణ చేసింది. తాను ఇచ్చే సెటిల్ మెంట్ క్యాష్ ను రూ. 27 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పింది. కానీ తాను చెప్పిన ఎమౌంట్ లో కచ్చితంగా రూ.1.5 కోట్లు ఉంటేనే ఒప్పుకుంటానని తెలిపింది.

ఈ సందర్భంగా అతని భార్య మాట్లాడుతూ పెళ్లయి ఇన్నేళ్లు గడచిన తరువాత తన భర్త ఇలా ప్రవర్తించడం తనకు నచ్చలేదని..అటువంటి భర్తతో కాపురం చేస్తూ గొడవలు పడేకంటే డబ్బులు తీసుకుని ఆ డబ్బుతో పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలగటమే మంచిదని…ఈ సమస్యకు దీనికంటే మంచి పరిష్కారం ఉండదని తాను అనుకున్నానని తెలిపింది. తన పిల్లల భవిష్యత్ దృష్ట్యా తాడు డబ్బులు తీసుకోవాల్సి వచ్చిందని..అంతే తప్ప డబ్బు కోసం కాదని స్పష్టంచేసింది.