Naga Shaurya: స్పీడు పెంచిన నాగశౌర్య.. క్లైమాక్స్ షూటింగ్‌లో లక్ష్య!
చాక్లెట్ బాయ్ నాగశౌర్య టాలీవుడ్ లోని టాలెంటెడ్ యంగ్ హీరోలలో ఒకడు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. సినిమా సినిమాకు తనను మార్చుకునే ఈ యంగ్ హీరో సినిమాలకు సైన్ చేయడం.. కంప్లీట్ చేయడంలో కూడా అంతే స్పీడుతో ఉన్నాడు. శౌర్య ప్రస్తుతం అరడజను సినిమాలలో నటిస్తున్నాడు.

Naga Shaurya
Naga Shaurya: చాక్లెట్ బాయ్ నాగశౌర్య టాలీవుడ్ లోని టాలెంటెడ్ యంగ్ హీరోలలో ఒకడు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. సినిమా సినిమాకు తనను మార్చుకునే ఈ యంగ్ హీరో సినిమాలకు సైన్ చేయడం.. కంప్లీట్ చేయడంలో కూడా అంతే స్పీడుతో ఉన్నాడు. శౌర్య ప్రస్తుతం అరడజను సినిమాలలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ ముందు మొదలైన ఈ సినిమాలలో కొన్ని షూటింగ్స్ చివరి దశకు కూడా చేర్చాడు.
వరుడు కావాలి, ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, లక్ష్య, పోలీస్ వారి హెచ్చరిక, నారీనారీనడుమ మురారీతో పాటు అనీష్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ దశలో ఉండగా ఇప్పుడు లక్ష్య సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మొదలవగా ప్రస్తుతం క్లైమాక్స్ దశకు చేరుకుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా శౌర్యకు 20వ చిత్రం కాగా ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తలుక్‌లో కనిపించనున్నాడు.
ఇప్పటికే సిక్స్ ప్యాక్ తో నాగశౌర్య మాచో రిప్డ్ లుక్ లో కండలు తిరిగిన దేహదారుఢ్యంతో ఉన్న ఫోటోలు వైరల్ కాగా ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతుండగా నాగశౌర్యతో పాటు, జగపతి బాబు ఇతరనటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఇతర ప్రమోషనల్ కంటెంట్‌మీద అంచనాలు పెరిగాయి.
https://twitter.com/UrsVamsiShekar/status/1413719445848035329