మాకు కరోనా లేదు, ఆరోగ్యంగానే ఉన్నాం.. వీడియో రిలీజ్ చేసిన నయనతార ప్రియుడు
ప్రముఖ నటి నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ కు కరోనా సోకిందని, వారు అనారోగ్యంతో

ప్రముఖ నటి నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ కు కరోనా సోకిందని, వారు అనారోగ్యంతో
ప్రముఖ నటి నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ కు కరోనా సోకిందని, వారు అనారోగ్యంతో బాధపడుతున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాతో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిద్దరూ ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో నయన్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు. అటు సహచరులు, కుటుంబసభ్యులు కూడా నయన్ జోడీ గురించి టెన్షన్ పడ్డారు. ఈ విషయం నయన్, విఘ్నేష్ జోడీకి తెలిసినట్టుంది.
వీడియోలో నయన్ జోడీ డ్యాన్స్:
దీంతో వారు స్పందించారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై విఘ్నేశ్ స్పందించాడు. తమకు కరోనా లేదని స్పష్టం చేశాడు. తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో నయన్, విఘ్నేశ్ సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
ఆ జోక్స్ చూసి నవ్వుకున్నాం:
‘మేము కరోనా బారినపడ్డామని వస్తున్న వార్తల్లో, సోషల్ మీడియా పోస్టుల్లో నిజం లేదు. మేము ఆరోగ్యంగా ఉన్నామని అభిమానులందరికీ తెలియజేస్తున్నాం. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్న జోకర్స్‌ని, వాళ్ల జోక్స్‌ని చూసి నవ్వుకునే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు మాకు ప్రసాదించాడు’ అని విఘ్నేశ్ వీడియోలో తెలిపాడు.
వీడియో క్యూట్ గా ఉంది:
ఈ వీడియో చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో ఇద్దరూ చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారు. బేబీ ఫేస్ ఫిల్టర్ యాప్ ద్వారా వారు ఇలా మారారు. Baby Shark పాటకు డ్యాన్స్ చేశారు. విఘ్నేష్ తన ఇన్ స్టాలో ఈ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. ఇద్దరూ చాలా క్యూట్ గా ఉన్నారని అభిమానులు అంటున్నారు.
సోషల్ మీడియాలో జోరుగా ఫేక్ న్యూస్:
ఈ వీడియో చూశాక నయన్ అభిమానులను, సహచరులు, కుటుంబసభ్యులు రిలాక్స్ అయ్యారు. ఇకనైనా నయన్ జోడీ గురించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు ఆపాలని అభిమానులు కోరారు. కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోన్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ లు బాగా పెరిగాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజమో అబద్దామో తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. దీంతో సెలబ్రిటీలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.
ఐదేళ్లుగా కలిసి ఉంటున్నారు:
గత ఐదేళ్లుగా నయన్, విఘ్నేష్ కలిసి ఉంటున్నారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇంతలో కరోనా లాక్ డౌన్ రావడంతో పెళ్లికి బ్రేక్ పడింది. నయన్ ముక్తి అమ్మన్ అనే సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ మూవీ మే 1వ తేదీకి విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు.