‘విరాట పర్వం’ లో నివేదా పేతురాజ్

Nivetha Pethuraj: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది. ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నివేదా పేతురాజ్ నటించనుందని శుక్రవారం చిత్ర యూనిట్ తెలియజేసింది. అయితే ఆమె ఎటువంటి పాత్రలో నటిస్తుందనే సంగతి మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
Welcome on board @Nivetha_Tweets 🙂 #ViraataParvam @RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm #ranadaggubati @VirataParvam https://t.co/odxegCcJzG
— Rana Daggubati ❤️ Diehard Fans (@RanadaggubatiF) December 11, 2020