ఫస్ట్ ఇన్ ఇండియా: సరసమైన ధరలో OnePlus Z కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది!

  • Published By: srihari ,Published On : June 23, 2020 / 04:41 PM IST
ఫస్ట్ ఇన్ ఇండియా: సరసమైన ధరలో OnePlus Z కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది!

వన్‌ప్లస్ కొత్త బడ్జెట్-స్మార్ట్‌ఫోన్‌ను ధృవీకరించింది. పుకార్లు, ఊహాగానాలకు చెక్ పెడుతూ భారతదేశం, ఐరోపాలో ముందుగా ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది.  సరసమైన స్మార్ట్‌ఫోన్ బెస్ట్ రేంజ్” లో ఈ మోడల్ వస్తుందని కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్ కో-ఫౌండర్, సీఈఓ Pete Lau వన్‌ప్లస్ కమ్యూనిటీ సైట్‌లోని ఫోరమ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

జూలైలో లాంచింగ్ తేదీని నిర్ధారించే “OnePlusLiteZThing” అనే యూజర్ పేరుతో సంస్థ కూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్  క్రియేట్ చేసింది. కొత్త రేంజ్‌లో మొదటి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడంపై సీఈఓ లా ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు. కొత్తగా క్రియేట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలిస్తే.. వన్‌ప్లస్ Z స్మార్ట్ ఫోన్ అని తెలుస్తోంది. 

‘ఈ కొత్త ప్రొడక్ట్ రేంజ్ మోడల్‌ను మొదట యూరప్, భారతదేశంలో ప్రవేశపెట్టనున్నాం’ అని ఫోరమ్ పోస్ట్‌లో ఆయన చెప్పారు. సమీప భవిష్యత్తులో కూడా మరింత సరసమైన స్మార్ట్‌ఫోన్‌లను ఉత్తర అమెరికాకు తీసుకురావాలని భావిస్తున్నామని తెలిపారు. వన్‌ప్లస్‌లో ప్రస్తుతం మొబైల్ అభివృద్ధి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న Paul Yu నేతృత్వంలోని కొత్త ప్రొడక్ట్ టీమ్ ఉంటుంది. ఈ కొత్త బృందానికి ప్రపంచం నలుమూలల నుండి సిబ్బంది ఉంటారని ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

జూలైలోనే లాంచ్ : 
కొత్త స్మార్ట్‌ఫోన్ లైన్ అధికారికంగా ప్రారంభించటానికి ముందే హైప్ క్రియేట్ చేస్తోంది కంపెనీ. అందుకే వన్‌ప్లస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించింది. ప్రస్తుతం ప్రైవేట్‌గానే ఉంచింది కంపెనీ. అందులో నాలుగు పోస్టులను మాత్రమే ఉంచింది. కొత్త లైన్ కింద మొదటి స్మార్ట్‌ఫోన్ జూలైలో లాంచ్ చేయనున్నట్టు ఈ ట్వీట్ సూచిస్తుంది. వన్‌ప్లస్ జెడ్ , వన్‌ప్లస్ నార్డ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ అంటూ పుకార్లు రాగా.. లాంచ్ డేట్‌గా మాత్రం జూలై 10 అని అంటున్నారు. ఇందులో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఎలా ఉండబోతున్నాయనేది వివరాలు తెలియాల్సి ఉంది.