Congress: ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఆహ్వానిస్తే బాగుండేది: కాంగ్రెస్

ఢిల్లీలో నిర్మిస్తోన్న‌ నూతన పార్లమెంటు భ‌వ‌నంపై ఏర్పాటు చేసిన భార‌త‌ జాతీయ చిహ్నం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కూడా ఆహ్వానిస్తే బాగుండేద‌ని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అక్క‌డ నిర్మించిన‌ జాతీయ చిహ్నాన్ని ఇవాళ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే.

Congress: ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఆహ్వానిస్తే బాగుండేది: కాంగ్రెస్

Cong

Congress: ఢిల్లీలో నిర్మిస్తోన్న‌ నూతన పార్లమెంటు భ‌వ‌నంపై ఏర్పాటు చేసిన భార‌త‌ జాతీయ చిహ్నం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కూడా ఆహ్వానిస్తే బాగుండేద‌ని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అక్క‌డ నిర్మించిన‌ జాతీయ చిహ్నాన్ని ఇవాళ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ దీనిపై మాట్లాడుతూ… నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నాన్ని నిర్మిస్తుండ‌డం మంచిప‌నే అని, అయితే, ఇందుకు సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానిస్తే బాగుండేద‌ని చెప్పారు.

Gardening: తోట‌పని చేస్తే మాన‌సిక ఆరోగ్యం

పార్లమెంటు ఏదో ఒక పార్టీకి లేదా ప్ర‌భుత్వానికి, ప్ర‌ధానికి సంబంధించిన‌ది కాద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జాస్వామ్యానికి పార్ల‌మెంటు ఓ మందిరం వంటిద‌ని చెప్పారు. ఆ భ‌వనం ప్ర‌తి పార్ల‌మెంటు స‌భ్యుడికి, ఆయా స‌భ్యుల పార్టీల‌కు సంబంధించిన‌దని ఆయ‌న అన్నారు. కాగా, నేడు పార్లమెంటు భ‌వ‌నంపై భార‌త‌ జాతీయ చిహ్నం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా అక్క‌డి కూలీలు, ఉద్యోగుల‌తో ప్ర‌ధాని మోదీ సంభాషించారు. మోదీతో పాటు లోక్‌స‌భ స్పీక‌ర్, కేంద్ర మంత్రి హ‌ర్దీప్ పూరీ కూడా ఉన్నారు.