Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముహూర్తం ఈవెంట్‌లో పవన్‌ని గమనించారా.. ఆ పార్టీకి కౌంటర్ ఇచ్చాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ తెరకెక్కించబోయే సినిమా ఎట్టకేలకు అధికారికంగా లాంచ్ అయ్యింది. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ సినిమా ముహూర్తం వేడుకలో పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చాడు. కొన్ని రోజులు క్రిందట పవన్...

Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముహూర్తం ఈవెంట్‌లో పవన్‌ని గమనించారా.. ఆ పార్టీకి కౌంటర్ ఇచ్చాడా?

Pawan Kalyan counter to ysrcp in ustaad bhagat singh event

Updated On : December 13, 2022 / 10:43 AM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ తెరకెక్కించబోయే సినిమా ఎట్టకేలకు అధికారికంగా లాంచ్ అయ్యింది. గతంలో వీరిద్దరి కలయికలో గబ్బర్ సింగ్ వంటి సినిమా రావడంతో, ఈ కాంబినేషన్ లో మరో మూవీ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఎటువంటి ప్రకటన లేకుండా ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్.

Pawan Kalyan : ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ ఘనంగా ప్రారంభించేసిన ఉస్తాద్ భగత్ సింగ్..

సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ సినిమా ముహూర్తం వేడుకలో పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చాడు. కొన్ని రోజులు క్రిందట పవన్, తన ఎన్నికల ప్రచారం కోసం ఒక వెహికల్ ని సిద్ధం చేయించుకున్నాడు. ‘వారాహి’ అనే పేరుని పెట్టిన ఆ వెహికల్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి నుంచి వై‌ఎస్‌ఆర్‌సిపి పార్టీ నాయకులు వారాహి కలర్ పై విమర్శలు చేసినంత వరకు అందరికి తెలిసిన విషయమే.

వాటిని ఎదురుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎదురు దాడి చేశారు. ఈ క్రమంలోనే ‘ఆలీవ్ గ్రీన్’ షర్ట్ వేసుకోవచ్చా అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. కాగా నేడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముహూర్తం ఈవెంట్‌లో పవన్‌.. ఆలీవ్ గ్రీన్ షర్ట్ వేసుకొని వచ్చి సందడి చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ అధికార పార్టీ చేసే విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకే, ఇలా ఆలీవ్ గ్రీన్ షర్ట్ లో వచ్చాడని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. జనసైనికులు అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వై‌ఎస్‌ఆర్‌సిపి పార్టీ నాయకులను ట్యాగ్ చేస్తున్నారు.