‘వకీల్ సాబ్’ టీజర్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి పండగే..

‘వకీల్ సాబ్’ టీజర్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి పండగే..

Updated On : January 7, 2021 / 8:10 PM IST

Pawan Kalyan’s Vakeel Saab: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కోసం సంక్రాంతి కానుక సిద్ధం చేశారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న ఫుల్ ప్యాక్డ్ పర్ఫామెన్స్‌తో ఎర్లీ సమ్మర్‌లో ఎంట్రీ ఇవ్వడానికి అంతా రెడీ చేసుకుంటున్న ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. సంక్రాంతి కానుకగా జనవరి 14
సాయంత్రం 6:03 PM కి ‘వకీల్ సాబ్’ టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ మూవీలో విమెన్ ఎమ్‌పవర్‌మెంట్ కోసం పోరాడే లాయర్‌గా సరికొత్తగా కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. సినిమా ఎలాంటిదైనా.. పవన్‌కున్న క్రేజే వేరు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు పవన్ కళ్యాణ్‌ని కొత్తగా చూపించబోతున్న ‘వకీల్ సాబ్’ టీజర్ కోసం వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.