లద్ధాఖ్‌లో మోడీ గర్జన : భారతదేశ శత్రువు మీ ఉగ్రరూపాన్ని చూసింది!

లద్దాఖ్ లో భారత ఆర్మీ సైనికులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కష్ట సమయంలో మనం పోరాడుతున్నామని ఆయన అన్నారు. మీ ధైర్య సాహసాలు మాకెంతో స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. చైనాకు గట్టి సందేశం ఇవ్వడానికే లద్దాఖ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఎల్ఏసీ వద్ద తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. భారత జవాన్లలో నైతిక స్థైర్యం నింపడానికే మోడీ పర్యటించారు. మూ బేస్ లో సైనికులను కలిసిన మోడీ వారిలో ఉత్సాహాన్ని నింపారు. చైనాతో చర్చలు జరుపుతూనే సరిహద్దులో ఆర్మీని మోడీ అలర్ట్ చేశారు.
మనం పోరాటం చాలా గొప్పదన్నారు. మనం ఎవరి కంటే తక్కువ కాదని చెప్పారు. మీ శక్తి సామర్థ్యాలపై మాకు పూర్తి విశ్వాసం ఉందని మోడీ అన్నారు. దేశ రక్షణ మీ చేతుల్లోనే ఉందని ధైర్యాన్ని నింపారు. మీ త్యాగం, సాహసాన్ని దేశం మరిచిపోదన్నారు. మీ మనోబలం అత్యున్నత శిఖరాల కంటే ఉన్నతమైనదిగా పేర్కొన్నారు. మీరు ప్రపంచానికి గట్టి సందేశమిచ్చారని మోడీ కొనియాడారు. దేశం మొత్తం మీ మీద సంపూర్ణ విశ్వాసంతో ఉందని చెప్పారు. మన సైనికులను చూసి నేను గర్వపడుతున్నాని అన్నారు. మీ ధైర్య సాహసాలకు ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడని చెప్పారు.
మీ త్యాగాలను సాహసాలను దేశం మరవదని అన్నారు. భారత్ శక్తి సామర్థ్యాలు ఏమిటో ప్రపంచానికి తెలిసేలా చేశారని ప్రశంసించారు. ఎవరికైనా దీటైన సమాధానం చెప్పే సత్తా భారత్ కు ఉందన్నారు. గాల్వాన్ లో ప్రాణ త్యాగం చేసిన వీర సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు తెలిపారు. లద్దాఖ్ నుంచి కార్గిల్ వరకు మీ ధైర్య సాహసాలు ప్రపంచమంతా చూసిందన్నారు. మాతృభూమిని రక్షించుకునేందకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని పిలుపునిచ్చారు. మన శక్తి సామర్థ్యాలు, ఆత్మ విశ్వాసం హిమాలయాల కంటే అత్యుత్తమమని అన్నారు. మీ నిబద్ధత ఏంటో మీ ముఖాల్లోనే తెలుస్తోందని చెప్పారు.
గాల్వాన్ ఘటన మన శక్తిని పెంచేలా చేసిందని అన్నారు. ధైర్యవంతులే శాంతిని కోరుకుంటారని చెప్పారు. శాంతి కోసం మనం ఎలా వ్యవహరిస్తున్నామో కూడా ప్రపంచం చూసిందన్నారు. శాంతిని కోరుకుంటాం కానీ మాతృభూమి జోలికి వస్తే ఊరుకోమన్నారు. సరిహద్దుల్లో మౌలిక వసతులను నవీకరిస్తున్నామని చెప్పారు. ఆక్రమణ శకం ముగిసిందని, ఇప్పుడంతా అభివృద్ధేనని మోడీ పిలుపునిచ్చారు. లద్దాఖ్ నుంచి కార్గిల్ వరకు.. సియాచిన్ నుంచి గాల్వాన్ వరకు మీ శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియజేశారని అన్నారు.
Read:11వేల ఎత్తులో సైనికులను కలిసిన మోడీ