CJI Justice Uday Umesh Lalit : సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్

సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉద‌య్ ఉమేష్ లలిత్ నియామకం కానున్నారు. జ‌స్టిస్ యూయూ లలిత్ నియామకంపై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము బుధ‌వారం(ఆగస్టు10,2022) నోటీసు జారీ చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్‌వీ ర‌మ‌ణ ఆగ‌స్టు 26,2022న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆయన స్ధానంలో జ‌స్టిస్ ఉద‌య్ ఉమేష్ ల‌లిత్ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బాధ్య‌తలు చేప‌ట్టనున్నారు.

CJI Justice Uday Umesh Lalit : సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్

CJI Justice Uday Umesh Lalit

Updated On : August 10, 2022 / 8:13 PM IST

CJI Justice Uday Umesh Lalit : సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉద‌య్ ఉమేష్ లలిత్ నియామకం కానున్నారు. జ‌స్టిస్ యూయూ లలిత్ నియామకంపై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము బుధ‌వారం(ఆగస్టు10,2022) నోటీసు జారీ చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్‌వీ ర‌మ‌ణ ఆగ‌స్టు 26,2022న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆయన స్ధానంలో జ‌స్టిస్ ఉద‌య్ ఉమేష్ ల‌లిత్ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బాధ్య‌తలు చేప‌ట్టనున్నారు.

ఆగ‌స్టు 27న యూయూ ల‌లిత్ 49వ సీజేఐగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించనున్నారు. సీజేఐ ఎన్‌వీ ర‌మ‌ణ త‌న వార‌సుడిగా యూయూ ల‌లిత్ పేరును కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ‌కు సూచించారు. న‌వంబ‌ర్ 8న జ‌స్టిస్ యూయూ లలిత్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తుండ‌టంతో సీజేఐగా ఆయ‌న కేవ‌లం 74 రోజులు కొన‌సాగనున్నారు.

Justice UU Lalit : సుప్రీంకోర్టు 49వ సీజేఐగా జస్టిస్ UU లలిత్‌

1957 న‌వంబ‌ర్ 9న యూయూ ల‌లిత్ జ‌న్మించారు. జూన్ 1983లో న్యాయ‌వాద వృత్తిని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 1985 డిసెంబ‌ర్ వ‌ర‌కూ బాంబే హైకోర్టులో ప‌ని చేశారు. ఆపై ఢిల్లీలో సేవ‌లు అందిస్తూ 2004లో సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాదిగా నియామకం అయ్యారు. సుప్రీంకోర్టు జ‌డ్జిగా ఆయ‌న‌ను బార్ సిఫార్సు చేయ‌క‌ముందు సీబీఐ త‌ర‌పున స్పెష‌ల్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌గా పనిచేశారు.