congress: అదే వైఎస్సార్ చివరి కోరిక: రేవంత్ రెడ్డి
వైఎస్సార్ చివరి కోరిక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాసపాత్రుడు వైఎస్సార్ అని చెప్పారు.

Revanth Reddy
congress: వైఎస్సార్ చివరి కోరిక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ వైఎస్సార్ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాసపాత్రుడు వైఎస్సార్ అని చెప్పారు. రాహుల్ గాంధీనీ ప్రధానిని చేసినప్పుడే వైఎస్సార్ ఆత్మకు శాంతి కలుగుతుందని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల్లో ఆదరణ పొందిన నేత వైఎస్సార్ అని కొనియాడారు.
Nandyal: అతిసారతో ఒకరి మృతి.. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స
ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజుల రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన నాయకుడు వైఎస్సార్ అని ఆయన చెప్పారు. వైఎస్సార్ గొప్ప రాజనీతజ్ఞుడు అని ఆయన అన్నారు. హైదరబాద్‌లో ఆయన స్మృతి వనం లేకపోవడం అవమానకరమని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం వైఎస్సార్ స్మృతి వనాన్ని నిర్మించాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాం ఆ పని చేయకపోతే అధికారంలోకి వచ్చాక తాము ఆ పనిచేస్తామని చెప్పారు. వైఎస్సార్ స్ఫూర్తితో పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని అన్నారు.