Bharat Jodo Yatra: రోడ్డుపై ఫుట్‌బాల్ ఆడుతూ రాహుల్, రేవంత్ రెడ్డి పాదయాత్ర.. వీడియో

తెలంగాణలోని మెదక్ జిల్లాలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. చౌటకూర్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ప్రారంభించిన పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఫుట్‌బాల్ ఆడుతూ రాహుల్, రేవంత్ రెడ్డి, ఇతర నేతలు పాదయాత్ర కొనసాగించడం అలరిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది.

Bharat Jodo Yatra: రోడ్డుపై ఫుట్‌బాల్ ఆడుతూ రాహుల్, రేవంత్ రెడ్డి పాదయాత్ర.. వీడియో

Updated On : November 5, 2022 / 4:32 PM IST

Bharat Jodo Yatra: తెలంగాణలోని మెదక్ జిల్లాలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. చౌటకూర్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ప్రారంభించిన పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఫుట్‌బాల్ ఆడుతూ రాహుల్, రేవంత్ రెడ్డి, ఇతర నేతలు పాదయాత్ర కొనసాగించడం అలరిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. కాగా, దేశ వ్యాప్తంగా రాహుల్ భారత్ జోడో యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.

ఇవాళ ఉదయం దానంపల్లి వద్ద పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. కాసేపట్లో గడిపెద్దాపూర్ వద్ద కార్నర్ సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ ఆళ్లదుర్గ్ సమీపంలో బస చేస్తారు. రాహుల్ గాంధీని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు. రాహుల్ పాదయాత్రలో టీపీసీసీ, ఏఐసీసీ నేతలు పలువురు పాల్గొంటున్నారు. రాహుల్ పాదయాత్ర ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఏపీలో ముగిసింది.