RRR: తారక్‌కు లేని టెన్షన్.. చెర్రీకి ఎందుకు?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన RRR చిత్రం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల పర్ఫార్మెన్స్‌కు.....

RRR: తారక్‌కు లేని టెన్షన్.. చెర్రీకి ఎందుకు?

RRR

Updated On : March 25, 2022 / 4:31 PM IST

RRR: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన RRR చిత్రం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ సినిమాకు అన్ని చోట్లా కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో భారీ బ్లాక్‌బస్టర్ మూవీగా ఈ సినిమా అవతరించబోతోంది. ఇక ఈ సినిమాలో భీమ్ పాత్రలో తారక్, రామరాజు పాత్రలో చరణ్‌ల పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. అయితే ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో వారు ఇంతకాలంగా పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

RRR: థియేటర్‌లో గన్‌తో వ్యక్తి హల్‌చల్‌.. భయాందోళనలో ప్రేక్షకులు!

కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ తరువాత తారక్ చాలా రిలీఫ్‌గా ఫీలవుతున్నాడు. గత మూడున్నరేళ్లుగా ప్రేక్షకులకు దూరంగా ఉన్న తారక్, ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో చాలా హ్యాపీగా ఉన్నారట. అయితే మరో హీరో చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్‌తో చాలా టెన్షన్ పడుతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇంతకీ తారక్‌కు లేని టెన్షన్ చరణ్‌కు ఏ విషయంలో ఉందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా చరణ్ టెన్షన్ పడుతుంది తన నెక్ట్స్ చిత్రాల విషయంలో అని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో త్వరోలనే చరణ్ బిజీగా పాల్గొననున్నాడట. ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో చరణ్ ఇప్పటి నుండే ఈ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 చిత్రం కోసం కూడా చరణ్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

RRR: యూనానిమస్ రెస్పాన్స్.. జక్కన్న ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్

దీంతో ఏమాత్రం గ్యాప్ లేకుండా చరణ్ ఫుల్ బిజీగా మారనున్నాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్‌లో దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న చరణ్, ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టును జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండటం.. శంకర్‌తో సినిమాను తెరకెక్కించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు టెన్షన్ పడుతున్నాడట. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో చరణ్‌కు ఈ సినిమాల బాధ్యత మరింత పెరిగిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అటు తారక్ కొంత గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.