Pawan Kalyan : నాన్నలాగే కూతురు అంటూ.. ఆద్య వీడియో పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. ఖుషి అవుతున్న పవన్ ఫ్యాన్స్..
తాజాగా పవన్ కూతురు ఆద్య కూడా కారు టాప్ ఓపెన్ చేసి పైకి నించుంది. కారులో వెళ్తుండగా ఆద్య ఇలా నిల్చోవడంతో రేణు దేశాయ్ దీన్ని వీడియో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోకి...........

Renu Desai posted Aadya video and its compare to pawan kalyan video
Pawan Kalyan : ఇటీవల పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్ళినప్పుడు కారు పైన కూర్చొని వెళ్లారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ స్టైల్, యాటిట్యూడ్ ఈ వీడియోలో సూపర్ గా ఉండటంతో ఇది అభిమానులని మరింత ఆకర్షించింది. పవన్ అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేశారు.
తాజాగా పవన్ కూతురు ఆద్య కూడా కారు టాప్ ఓపెన్ చేసి పైకి నించుంది. కారులో వెళ్తుండగా ఆద్య ఇలా నిల్చోవడంతో రేణు దేశాయ్ దీన్ని వీడియో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోకి ‘నాన్న లాగే కూతురు కూడా’ అని కొటేషన్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆద్య వీడియో కూడా వైరల్ గా మారింది. ఆద్య కూడా పవన్ లాగే కారుపై నుంచి కనపడేలా నిల్చోవడంతో, రేణు దేశాయ్ ఇలా పవన్ గురించి పోస్ట్ పెట్టడంతో పవన్ అభిమానులు ఖుషి అవుతున్నారు.