School breakfast: బాలికల స్కూల్లో అటుకుల్లో పురుగులు.. బ్రేక్ ఫాస్ట్‌గా తిని 25 మందికి అస్వస్థత

పాఠశాల విద్యార్థినులకు కలుషిత ఆహారం ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సిబ్బంది. నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. అందులో విద్యార్థులను బ్రేక్ ఫాస్ట్ గా అటుకులు ఇచ్చారు. అయితే, అవి తిన్నాక విద్యార్థునులు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో వారిని వెంటనే నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

School breakfast: బాలికల స్కూల్లో అటుకుల్లో పురుగులు.. బ్రేక్ ఫాస్ట్‌గా తిని 25 మందికి అస్వస్థత

Updated On : November 5, 2022 / 12:23 PM IST

School breakfast: పాఠశాల విద్యార్థినులకు కలుషిత ఆహారం ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సిబ్బంది. నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. అందులో విద్యార్థులను బ్రేక్ ఫాస్ట్ గా అటుకులు ఇచ్చారు. అయితే, అవి తిన్నాక విద్యార్థునులు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు.

దాదాపు 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో వారిని వెంటనే నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమకు బ్రేక్ ఫాస్ట్ గా ఇచ్చిన అటుకుల్లో పురుగులు కనపడ్డాయని కొందరు బాలికలు తెలిపారు. నారాయణఖేడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 25 మంది విద్యార్థినులను చూసేందుకు వారి తల్లిదండ్రులు వస్తున్నారు.

కస్తూర్బా బాలికల పాఠశాల సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురుగులు పట్టిన ఆహారాన్ని ఇచ్చి బాలికలను ఆసుపత్రి పాలు చేశారని మండిపడుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..