Kshama Bindu: తనను తాను పెళ్లి చేసుకున్న క్షమా బిందు గుర్తుందా? మొదటి పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంది
2022 లో తనను తాను పెళ్లి చేసుకుని సంచలనానికి తెర లేపిన క్షమా బిందుని ఎవరూ మర్చిపోరు. పెళ్లి తరువాత సోలో లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న ఆమె మొదటి పెళ్లిరోజు వేడుకలు రీసెంట్‌గా జరుపుకుంది.

Kshama Bindu
Kshama Bindu : తనను తాను పెళ్లి చేసుకుని సంచలనంగా రేపిన గుజరాత్ అమ్మాయి క్షమా బిందు అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆమె మొదటి పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంది. దేశంలోనే తనను తాను పెళ్లి చేసుకున్న మొదటి వ్యక్తిగా అప్పట్లో క్షమా బిందు వార్తల్లో నిలిచింది.
Self Marriage: అంగరంగ వైభవంగా సెల్ఫ్ మ్యారేజ్ చేసుకున్న యువతి
గుజరాత్ వడోదరకు చెందిన క్షమా బిందు జూన్ 8, 2022 లో తనను తాను పెళ్లి చేసుకున్న యువతిగా సంచలనం రేపింది. పెళ్లి తరువాత సింగిల్‌గానే హనీమూన్‌కి కూడా వెళ్లి ఎంజాయ్ చేసింది. కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో అప్పట్లో ఈమె వివాహం జరిగింది. అయితే రీసెంట్‌గా క్షమా బిందు మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. kshamachy అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ‘మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేసుకుంది.
Sologamy Kshama Bindu : తనను తానే పెళ్లి చేసుకోవాలన్న అమ్మాయికి మరో కష్టం.. అయినా తగ్గేదేలే..
ఈ వీడియోలో పెళ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు మరికొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది ‘వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని కామెంట్లు పెడుతున్నారు. ‘అద్భుతం’ అని ఒకరు.. ‘అభినందనలు’ అని మరొకరు పంచుకున్నారు. చాలామంది హార్ట్ ఎమోజీని పంపి స్పందించారు. సో.. మొత్తానికి స్వీయ వివాహం చేసుకున్న క్షమా బిందు జీవితాన్ని సోలోగా సంతోషంగా గడుపుతోంది.
View this post on Instagram