Shahid Afridi: షమీ ‘కర్మ’ ట్వీట్‌పై స్పందించిన షాహిద్ అఫ్రిది.. ఇద్దరు క్రికెటర్లకు హింతబోధ చేశాడు..

క్రికెటర్లు అంబాసిడర్‌ల వంటివాళ్లు. రెండు దేశాల (భారత్, పాకిస్తాన్) మధ్య ఉన్న విబేధాలను అంతం చేయడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. ప్రజలలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఇలాంటివి జరగకూడదని నేను భావిస్తున్నాను అంటూ పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది అన్నారు.

Shahid Afridi: షమీ ‘కర్మ’ ట్వీట్‌పై స్పందించిన షాహిద్ అఫ్రిది.. ఇద్దరు క్రికెటర్లకు హింతబోధ చేశాడు..

Shahid Afridi

Updated On : November 14, 2022 / 1:20 PM IST

Shahid Afridi: టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్ పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగినప్పటికీ.. సోషల్ మీడియాలో మాటల యుద్ధం పాక్ వర్సెస్ ఇండియా అభిమానుల మధ్య జరిగింది. మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల మాజీ ప్లేయర్లుసైతం ఒకరు టీంలోని లోపాలను ఒకరు ఎత్తుచూపుతూ ట్వీట్లు చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై పాక్ ఓడిపోవటంతో ఆజట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ అక్తర్ బాధాకరమైన ట్వీట్ చేశాడు. బ్రోకెన్ హార్ట్ ఎమోజీని ట్వీట్టర్ లో పోస్టు చేశాడు.

Pakistan PM Shehbaz Sharif: ఇండియా ఓటమిపై పాక్ ప్రధాని ఆసక్తికర ట్వీట్.. గట్టి కౌంటర్ ఇచ్చిన టీమిండియా ఫ్యాన్స్..

అక్తర్ ట్వీట్‌కు ప్రతిస్పందనగా టీమిండియా పాస్ట్ బౌలర్ షమీ స్పందించారు. వ్యగ్యంగా స్పందిస్తూ.. ’క్షమించండి సోదరా.. ఇది కర్మ అని పిలుస్తారు’ అంటూ రాశాడు. తాజాగా షమీ ట్వీట్ పై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది స్పందించారు. మాజీ,. ప్రస్తుత క్రికెటర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలంటూ హితవు పలికారు.

Shami vs Akhtar: పాక్ ఓటమిపై అఖ్తర్ బాధాకరమైన పోస్ట్.. ఆసక్తికర కౌంటర్ ఇచ్చిన షమీ

‘క్రికెటర్లు అంబాసిడర్‌ల వంటివాళ్లు. రెండు దేశాల (భారత్, పాకిస్తాన్) మధ్య ఉన్న విబేధాలను అంతం చేయడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. ప్రజలలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఇలాంటివి జరగకూడదని నేను భావిస్తున్నాను. మనం ఇలా చేస్తే, అప్పుడు అక్షరాస్యత లేని, సామాన్యుడు నుండి మనం ఏమి ఆశించాలి అంటూ అఫ్రీది అన్నారు. మనం మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. క్రీడలతో ఇరుదేశాల మధ్య సంబంధాన్ని ఎప్పటికీ మెరుగ్గా ఉంచుతాయంటూ అఫ్రిది పేర్కొన్నాడు. మీరు రిటైర్డ్ ప్లేయర్ అయినప్పటికీ మీరు అలాంటి పనులు చేయకూడదు అక్తర్‌ను, మీరు ప్రస్తుతం జట్టుతో ఆడుతున్నారు, మీరు అలాంటి వాటికి దూరంగా ఉండాలి అంటూ షమీకి అఫ్రీది హితబోధ చేశాడు.