శృతికి కొత్త బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే విషెస్

శృతికి కొత్త బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే విషెస్

Updated On : January 29, 2021 / 9:23 PM IST

Shruti Haasan: హాట్ బ్యూటీ శృతి హాసన్ తన 35వ బర్త్‌డేని బాంబేలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ పుట్టినరోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది.. అదేంటంటే శృతి కొత్త బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇటీవలే ఈ జంట ఎయిర్‌పోర్ట్‌లో, హైదరాబాద్ రోడ్లపై కెమెరా కంట పడ్డారు.

Shruti Haasan

శృతి బర్త్‌డే సందర్భంగా ఆమె ప్రియుడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. లవ్ బర్డ్స్ ఇద్దరూ హాట్‌గా హగ్ చేసుకున్న పిక్ షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు. కాగా శృతి హాసన్ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత మైఖేల్ కోర్సలే తో బ్రేకప్ చేసుకుంది.

Shruti Haasan

ప్రస్తుతం శాంతనుతో శృతి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. కొద్ది రోజలుగా ఈ జంట డేటింగ్ చేస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత రవితేజ ‘క్రాక్’ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చిన శృతి హాసన్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ లో నటిస్తోంది. ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ తర్వాత పవన్‌తో శృతి ముచ్చటగా మూడోసారి నటిస్తుంది.

Shruti Haasan